Advertisementt

నాగ చైతన్యకి కి డ్యామేజ్ తప్పదా

Tue 02nd Mar 2021 11:53 AM
sai pallavi,naga chaitanya,love story,sekhar kammula,sai pallavi complete domination,naga chaitanya - sekhar khammula  నాగ చైతన్యకి కి డ్యామేజ్ తప్పదా
Sai Pallavi Complete Domination నాగ చైతన్యకి కి డ్యామేజ్ తప్పదా
Advertisement
Ads by CJ

శేఖర్ కమ్ముల - సాయి పల్లవి మ్యాజిక్ ఫిదా ని హిట్ చేసింది. అందులో వరుణ్ తేజ్ హీరో అయినా.. మెయిన్ గా సాయి పల్లవే హైలెట్ అయ్యింది. ఆమె తెలంగాణ భాష, సాయి పల్లవి డాన్స్, శేఖర్ కమ్ముల మేకింగ్ ముందు వరుణ్ తేజ్ ఎంతగా పెరఫార్మెన్స్ ఇచ్చినా.. ఎక్కడో కాస్త డల్ అయ్యాడా అనిపిస్తుంది. రీసెంట్ గా లవ్ స్టోరీ లోను అదే పరిస్థితి. మరోసారి సాయి పల్లవి - సాయి పల్లవి అంటూ మ్యాజిక్ రిపీట్ చేస్తున్నారు. సాయి పల్లవి ముందు ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న నాగ చైతన్య తేలిపోతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. సాంగ్స్ లో సాయి పల్లవి డాన్స్ ఆమె అందం, లంగావోణీ స్టయిల్ అన్ని లవ్ స్టోరీపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఎక్కడ చూసినా సాయి పల్లవి, సాయి పల్లవి అంటున్నారు తప్ప నాగ చైతన్య మాట వినిపించడం లేదు.  

శేఖర్ కమ్ముల డైరెక్షన్ పై అంచనాలు పెరగడమే కాదు.. మరోసారి మ్యాజిక్ రిపీట్ చెయ్యబోతున్నాడు, మరోసారి ఫిదా చెయ్యబోతున్నాడు అంటూ హైలెట్ చేస్తున్నారు తప్ప నాగ చైతన్య మాట ఎక్కడా వినిపించడం లేదు. లవ్ స్టోరీ అంటే శేఖర్ కమ్ముల - సాయి పల్లవి అంటున్నారు తప్ప హీరో నాగ చైతన్య ముచ్చట వచ్చింది లేదు. మజిలీ లాంటి మంచి హిట్ కొట్టిన నాగ చైతన్య కి లవ్ స్టోరీ హిట్ అయినా.. ఆ క్రేజ్ ఆ సక్సెస్ మొత్తం సాయి పల్లవి, శేఖర్ కమ్ముల అకౌంట్ లోకి వెళ్ళిపోయి నాగ్ చైతన్య కి ఏమైనా డ్యామేజ్ అవ్వోచ్చేమో అంటున్నారు. ఈ ఎఫెక్ట్ అతని నెక్స్ట్ మూవీస్ మీద పడొచ్చేమో అనే అనుమానాలు అక్కినేని ఫాన్స్ లో మొదలయ్యాయి.

Sai Pallavi Complete Domination:

Sai Pallavi Complete Domination of Naga Chaitanya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ