ఈ మధ్యన భారీ బడ్జెట్ మూవీ సెట్స్ నుండి ఫొటోస్ లీకవడం, వీడియో క్లిప్స్ బయటికి రావడం అనేది సర్వసాధారణంగా అయ్యింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడు కెమెరాతో షూట్ చెయ్యడం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చెయ్యడం, అక్కడ సినిమా యూనిట్ ఎన్ని కష్టాలు పడి సినిమా చిత్రీకరణ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఆ సినిమాలో ఎలాంటి సర్ప్రైజ్ లు ఇస్తున్నారో అనేది ఆలోచన కూడా చెయ్యకుండా ఇలాంటి లీకులను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఆచార్య, పుష్ప, ప్రభాస్ సలార్ ఇలా ప్రతి బిగ్ మూవీ నుండి ఏదో ఒక లీకు యూనిట్స్ ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. సెల్ ఫోన్స్ ని సెట్ లోకి రాకుండా బ్యాన్ చేసినా ఏదో ఒక రకంగా ఈ లీకులు వస్తున్నాయంటే ఏం చెయ్యాలి, ఎలా అడ్డుకట్ట వెయ్యాలో అర్ధం కావడం లేదు.
ఇక అన్నిటిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే జక్కన్న కూడా ఈ లీకులకి అతీతుడు కాలేకపోతున్నారు. గతంలో ఆయన తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర తాలూకు ఫొటోస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే రీసెంట్ గా ఎన్టీఆర్ - రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఒలీవియా ఫొటోస్ కూడా సాంఘీక మాధ్యమాల్లో ప్రత్యక్షం అవడంతో ఆర్.ఆర్.ఆర్ యూనిట్ షాకైంది. ఆర్.ఆర్.ఆర్ లోని కొన్ని షాట్స్ నే లీక్ చేసేసారు. టెక్నీకల్ గా హై స్టాండ్డ్స్ ని మెయింటింగ్ చేసే రాజమౌళినే ఈ లీకులు ఆపలేక చేతులెత్తేశాడనిపిస్తుంది. మరి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ నుండి లీకైన ఫొటోస్ చూసి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ అంతా తమ హీరోల విశ్వరూపం ఆర్.ఆర్.ఆర్ లో చూడబోతున్నాం అంటూ సంబరాలు స్టార్ట్ చేసేసారు.