Advertisementt

బాలయ్య ఆవేశం.. అభిమాని ఆనందం

Sat 06th Mar 2021 08:42 PM
balakrishna,unleashes,angry,hindupur road show,ap municipal elections,balayya fans,nandamuri fans,balakrishna fans,tdp  బాలయ్య ఆవేశం.. అభిమాని ఆనందం
Balayya rage, Fans delight బాలయ్య ఆవేశం.. అభిమాని ఆనందం
Advertisement
Ads by CJ

బాలకృష్ణ కి ఆవేశం వచ్చింది అంటే ఎదుటి వాడికి చెంప పగలడం అనేది తరుచు వింటూనే ఉంటాం. బాలయ్య కి కోపం రానంతవరకే ఎవరైనా ఆయన ముందు వేషాలు వేసేది. సహజంగానే బాలకృష్ణది పసిపిల్లవాడి మనస్తత్వం అంటుంటారు ఆయన సహా నటులు, ఆయన సన్నిహితులు. కానీ బాలకృష్ణ కి వచ్చే ఆగ్రహావేశాలకు ఒక్కోసారి ఆయన అభిమహులు బలవుతుంటారు. అయితే అభిమానులు అది బలవడం అనుకోరు.. బాలయ్య చేతి స్పర్శ తాకితేనే చాలు అనుకునే అభిమానులు ఆయన సొంతం. రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపూర్ రోడ్ షో ల్లో పాల్గొంటున్నారు బాలకృష్ణ.

అందులో భాగంగా బాలయ్య ని ఆయన స్పీచ్ ని ఓ అభిమాని సెల్ ఫోన్ లో వీడియో తీస్తుండగా.. బాలకృష్ణ అతన్ని వారించినా వినకుండా వీడియో తీస్తూనే ఉండడంతో బాలకృష్ణకి కోపం నషాళానికంటింది. దానితో ఆ వీడియో తీస్తున్న అతని చెంప పై బాలయ్య చెయ్యి పడింది. ఎదుటి వాని చెంప పగిలింది. కొట్టడం కరెక్ట్ అని ఎవరూ చెప్పారు. కానీ అతి చేస్తే కోపం రావడం సహజం. కానీ మాటలతో వారిస్తే సరిపోతుంది. ఇలా చెయ్యి చేసుకోవడం ఎదుటి వారు విమర్శలకు అవకాశం కల్పించినట్టే. ఇక్కడా అదే జరిగింది. బాలకృష్ణ అభిమాని చెంప మీద కొట్టడం వైసీపీ పార్టీ వాళ్ళకి అవకాశం దొరికింది. బాలయ్య అభిమానిని కొట్టిన వీడియోని మీడియాలో ప్రదర్శిస్తూ.. రకరకాల కామెంట్స్ వారు బాలయ్యపై విరుచుకుపడుతున్నారు. వెంటనే దెబ్బ కొట్టించుకున్న అభిమాని లైన్ లోకొచ్చి.. కోపంతో బాలయ్య కొట్టలేదు.. కొట్టినా నాకు ఆనందమే .. బాలకృష్ణ చెయ్యి నా చెంపని తాకింది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో.. అందరూ బాలయ్య ఆవేశం.. అభిమాని ఆనందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Balayya rage, Fans delight:

Balakrishna unleashes his angry in Hindupur road show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ