తెలుగులో నిఖిల్ తో రెండు సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడినట్లుగా అది కూడా క్రికెటర్ బుమ్రా తో అనుపమ లవ్ ఎఫ్ఫైర్ నడుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అనుపమ పరమేశ్వరన్ - బుమ్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని కూడా న్యూస్ నడుస్తుంది. నిఖిల్ తో 18 పేజెస్ సినిమాలోని, అలాగే కార్తికేయ 2 సినిమాలోనూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్పుడు ట్రెడిషనల్ గా హోమ్లీ గా కనబడే అనుపమ ఈ మధ్యన గ్లామర్ షో కి కూడా వెనకడుగు వెయ్యడం లేదు..
అయితే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ గుజరాత్ వెళ్ళింది. అదే టైం కి క్రికెటర్ బుమ్రా కూడా గుజరాత్ కి వెళుతూ ట్వీట్ చెయ్యడంతో అనుపమ పరమేశ్వరన్ - బుమ్రా ఎంగేజ్మెంట్ కోసమే గుజరాత్ వెళ్లినట్టుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. దానితో అనుపమ పరమేశ్వరన్ తల్లి లైన్ లోకి వచ్చి అనుపమ - బుమ్రా పెళ్లి విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఓ సినిమా షూటింగ్ కోసమే అనుపమ గుజరాత్ వెళ్ళింది అంటూ క్లారిటీ ఇవ్వడమే కాదు.. తన కూతురికి ఎలాంటి లవ్ ఎఫ్ఐర్స్ లేవంటూ ఫైర్ అవుతుంది అనుపమ తల్లి.