Advertisementt

పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ లుక్

Sun 07th Mar 2021 11:36 AM
pawan kalyan,pawan fitness look,krish movie,vakeel saab movie,ak remake,pawan latest look  పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ లుక్
Pawan Kalyan Fitness Look పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ లుక్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడపడంతో ఆయన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. గత మూడేళ్ళుగా రాజకీయాలంటూ ఉదయం లేచిన దగ్గరనుండి.. ప్రజలు కోసం, జనసేన కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ ని వదిలేసారు. కానీ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ షేప్ లేని బాడీ తో యాక్షన్ సీక్వెన్సెస్ లో కనిపిస్తే ఫాన్స్ కి నచ్చడు. అలాగే కేరెక్టర్ కి సరిపోయే లుక్ లోకి పవన్ కచ్చితంగా మారాల్సిందే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కొసం లాయర్ లుక్ కాబట్టి పెద్దగా వేరియేషన్స్ అక్కర్లేదు. మరోపక్క ఏకే రీమేక్ కి పవన్ ఫిట్ నెస్ తో పని లేదు. 

కానీ క్రిష్ సినిమా కోసం పవన్ మంచి లుక్, మంచి ఫిట్ నెస్ తో కనిపించాలంటే ఫిట్ గా ఉండడానికి జిమ్ చెయ్యవల్సిందే. అయితే టైం లేని పవన్ కోసం బెంగుళూరు నుండి ఫిట్ నెస్ ట్రైనర్ దిగిన విషయం తెలిసిందే. అతని ఆధ్వర్యంలోనే పవన్ కళ్యాణ్ జిమ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు కుర్తా పైజామా తప్ప మరో డ్రెస్ లో కనిపించడం లేదు. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ జిమ్ డ్రెస్ లో మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి స్పెషల్ జిమ్ ట్రైనింగ్ లో పవన్ కళ్యాణ్ సన్నబడి ఫిట్ నెస్ లుక్ లో అదరగొట్టేస్తున్నారు. దానితో పవన్ ఫాన్స్ ఖుషీగా అవుతున్నారు. నిన్నమొన్నటివరకు పవన్ లుక్, జిమ్ విషయంలో వర్రీ అయిన ఫాన్స్.. పవన్ న్యూ లుక్ చూసి కూల్ అయ్యారు.

Pawan Kalyan Fitness Look:

Pawan Kalyan Fitness New Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ