Advertisementt

పెళ్లి డేట్ మీరే చెప్పమంటున్న మంచు హీరో

Sun 07th Mar 2021 02:43 PM
manchu manoj,manoj manchu,manchu family,manoj second marriage,manoj reacts on second marriage,manoj movies,manchu manoj cinema  పెళ్లి డేట్ మీరే చెప్పమంటున్న మంచు హీరో
Manchu Manoj Response on His Second Marriage పెళ్లి డేట్ మీరే చెప్పమంటున్న మంచు హీరో
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అటు వ్యక్తిగతంగాను మంచు మనోజ్ ఒంటరి వాడయ్యాడు. కారణం ప్రేమించి పెళ్లాడిన భార్యతో విభేదాల కారణముగా విడాకులు తీసుకున్న మనోజ్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడు. ఇక ఈమధ్యన బాగా స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చి షాకివ్వడమే కాదు.. త్వరలోనే శుభ వార్త చెబుతా అన్నాడు. అయితే కొన్ని రోజులుగా మనోజ్ సెకండ్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ రెండో పెళ్లి.. అది కూడా మోహన్ బాబు గారి ఫ్యామిలీ లోని చుట్టాలమ్మాయినే మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. 

నిజంగానే  మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని అందరూ అనుకునేలా ఉన్నాయి ఆ వార్తలు. అయితే తన రెండో పెళ్లి విషయమై మనోజ్ ఫన్నీగా స్పందించాడు. అంటే నా సెకండ్ మ్యారేజ్ వార్తలపై ఏవేవో న్యూస్ లు వినిపిస్తున్నాయి.. ఇన్ని వార్తలు రాసిన వారు.. మీరే నా సెకండ్ మ్యారేజ్ డేట్ అండ్ ముహూర్తం మరియు పెళ్లి జరిగే ప్లేస్ కూడా చెప్పెయ్యండి అంటూ ఫన్నీగా ట్వీట్ చేసాడు. అంటే వెటకారంగా మనోజ్ ట్వీట్ ఉన్నప్పటికీ.. తన సెకండ్ మ్యారేజ్ వార్తలని మనోజ్ ఈ ట్వీట్ తో ఖండించినట్టుగా అర్ధమవుతుంది.

Manchu Manoj Response on His Second Marriage:

Manchu Manoj reacts on second marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ