Advertisementt

ఇలియానా మానసిక క్షోభ

Tue 09th Mar 2021 11:11 AM
ileana,fitness,workouts,tollywood beauty ileana,south beauty ileana,bollywood,ileana movie offers,body shaming  ఇలియానా మానసిక క్షోభ
Ileana opens up on her struggle with depression ఇలియానా మానసిక క్షోభ
Advertisement
Ads by CJ

ఇలియానా అంటే బుల్లి నడుము, సన్నజాజి తీగ లాంటి నడుము, ఇలియానా అంటే స్లిమ్ బ్యూటీ అని యూత్ మొత్తం ఇల్లి బేబీ చుట్టూ తిరిగిన వాళ్ళే. ఇల్లీ బేబీ ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన తార. స్టార్ హీరోస్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్ లాంటి హీరోలందరితో నటించిన ఇలియానా కి బాలీవుడ్ మీద మోజు పుట్టింది. అలాగని అక్కడైనా ఇలియానా కుదురుకుందా? లేదే.. బాయ్ ఫ్రెండ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరికి అతనికి బ్రేకప్ చెప్పి డిప్రెషన్ లోకి వెళ్లి.. స్లిమ్ బ్యూటీ కాస్తా.. బబ్లీ బ్యూటీ అయ్యింది. దానితో ఇలియానా అంటే అభిమానం ఉన్న వారే విమర్శించడం మొదలు పెట్టారు. బరువు పెరిగిన ఇలియానాకి సినిమా అవకాశాలు దూరమయ్యాయి. మళ్ళీ పట్టుదలతో బరువు తగ్గి స్లిమ్ బ్యూటీలా మారినా ఇలియానా ఫేస్ లో కళ కోల్పోయింది.

అయినా బరువు తగ్గి స్లిమ్ గా అయిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఇలియానా రీసెంట్ గా తనపై బాడీ షేమింగ్ దారుణంగా ఉండేదంటూ ఓ ఇంటర్వ్యూ లో షాకింగ్ గా మాట్లాడింది. తనని ఒకప్పుడు చాలామంది వెక్కించారని, ఈ అమ్మాయి హీరోయిన్ ఏమిటి? అసలు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్ ఎలా అవుతావ్? అంతేకాకుండా హీరోయిన్ కావాలంటే వక్షోజాలు పెద్దగా ఉండాలని, కానీ నీకు లేవని చాలా హేళనగా మాట్లాడేవారంటూ గుర్తు చేసుకుంది. అయితే ఇలియాననే తన బాడీ లో తనకి నచ్చని పార్ట్శ్ కూడా ఉన్నాయంటూ చెప్పి షాకిచ్చింది. తన ఎదభాగంతో పాటు తన చేతులు కూడా సన్నగా ఉంటాయని అలాగే ముక్కు పెదాలు కూడా సరిగా ఉండవని, ఇక తాను చూడడానికి పొడవుగా కనిపించనని.. పైగా నల్లగా కూడా ఉంటానని చెబుతుంది ఇలియానా. 

అయితే తనలోనూ బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని.. కానీ వాటి గురించి మాట్లాడకుండా తనలోని లోపాలని ఎత్తి చూపించారంటూ వాపోతుంది. ఇలియానా కి సినిమా అవకాశాలు ఈజీగా వచ్చెయ్యలేదు. ఎన్నో కష్టాలు పడితేనే కానీ.. ఇలియానా స్టార్ అవ్వలేదనేది ఆమె ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది.

Ileana opens up on her struggle with depression:

Ileana opens up on her struggle with depression

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ