Advertisementt

హరి హర వీరమల్లు గా పవర్‌స్టార్

Thu 11th Mar 2021 05:45 PM
hari hara veera mallu posters,power star pawan kalyan hari hara veera mallu movie,hari hara veera mallu first look,hari hara veera mallu pawan look posters,hari hara veera mallu movie review,krish hari hara veera mallu movie,hari hara veera mallu  హరి హర వీరమల్లు గా పవర్‌స్టార్
Pawan Kalyan Hara Hara Veera Mallu First Look హరి హర వీరమల్లు గా పవర్‌స్టార్
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ టైటిల్  హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు

ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ విడుద‌ల

రూ. 150 కోట్ల‌తో మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్ గ్రాండియ‌ర్‌గా నిర్మిస్తోన్న చిత్రం

2022 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌కు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ  ప్రొడ్యూస‌ర్ఎ.ఎం. ర‌త్నం ఈ ఎపిక్‌ చిత్రానికి సమర్పకులు.

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఫ‌స్ట్ లుక్  గ్లిమ్స్‌ను విడుద‌ల చేశారు. ఆ లుక్‌నుచూడ‌గానే అద్భుతంగా అనిపిస్తోంది.

హరి హర వీరమల్లు గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ తొలి

 దృశ్యమాలిక‌లో పవన్ లుక్  పూర్తిగా కొత్త‌ద‌నంతో క‌నిపిస్తోంది. పై నుంచి కింద దాకా ఆయ‌న రూపం పూర్తిగా మారిపోయింద‌ని స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది మ‌నం గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపం. డైరెక్ట‌ర్ క్రిష్అద్భుత‌మైన విజ‌న్‌కు త‌గ్గ‌ట్లు కీర‌వాణి టెర్ర‌ఫిక్ మ్యూజిక్‌, గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌తో ఈ ఫ‌స్ట్ గ్లిమ్స్ అపూర్వం గాఉంది.

ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ. అని డైరెక్ట‌ర్ క్రిష్ చెప్పారు. నేటి త‌రం

 ద‌ర్శ‌కుల్లో ఒకఇంద్ర‌జాలికుడు లాంటి ఆయ‌న త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైనవిజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. క‌చ్చితంగాఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని

 ఇస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు. 

ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్‌ నలభై శాతం పూర్త‌యింది. జూలై నాటికి మొత్తం చిత్రీక‌ర‌ణ‌నుపూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తామ‌నే ఆశాభావాన్ని నిర్మాత‌ ఎ. ద‌యాక‌ర్ రావు వ్యక్తం చేశారు. పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ప‌నుల కోస‌మే ఆరు నెలల సమయాన్ని కేటాయించారు. ప‌లుహాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన బెన్ లాక్ ఈ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను పర్యవేక్షిస్తారు.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు 

అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.

పాన్‌ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

2022 సంక్రాంతికి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

Pawan Kalyan Hara Hara Veera Mallu First Look:

Pawan Kalyan Hara Hara Veera Mallu First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ