Advertisementt

సూపర్ స్టార్ సినిమాలో ఉప్పెన బ్యూటీ

Thu 11th Mar 2021 08:42 PM
krithi shetty,uppena beauty,bebamma,super star mahesh movie,sarkaru vaari paata movie,mahesh next,rajamouli,ram movie,sudheer babu movie,nani shyam singa roy movie  సూపర్ స్టార్ సినిమాలో ఉప్పెన బ్యూటీ
Uppena Beauty in Superstar Movie సూపర్ స్టార్ సినిమాలో ఉప్పెన బ్యూటీ
Advertisement
Ads by CJ

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఆ సినిమా హిట్ తో ఓవర్ నైట్ స్టార్ అవడంతో ఆ భామ వెంట యంగ్ హీరోలు పడుతున్నారు. ఉప్పెన సినిమాలో బేబమ్మ గా కృతి శెట్టి నటనకు, ఉప్పెన ఈవెంట్స్ లో ట్రెడిషనల్ గా ఆకట్టుకోవడంతో ఆ బ్యూటీ పై యంగ్ హీరోస్ కన్ను పడింది. ఇక ఉప్పెన సినిమాకి కేవలం అరంటే ఆరు లక్షల పారితోషకానికే పని చేసిన కృతి శెట్టి రేంజ్ ఇప్పుడు 60 లక్షల నుండి కోటికి చేరింది అనే టాక్ ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో కృతి శెట్టి కోరికల చిట్టాకి దిమ్మ తిరిగిన నిర్మాతలు అనే క్యాప్షన్ తో న్యూస్ లు హైలెట్ అవుతున్నాయి. ప్రస్తుతం సుధీర్ బాబు, నాని సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టికి రామ్ సరసన తెలుగు, తమిళల మూవీ ఆఫర్ తగిలింది.

అయితే ప్రస్తుతం దర్శకనిర్మాతలు బేబమ్మతో పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు కూడా. మరి అలాంటి టైం లో ఉప్పెన బ్యూటీకి సూపర్ స్టార్ మహేష్ మూవీలో ఓ ఆఫర్ వచ్చింది అనే న్యూస్ ఉంది చూసారు.. వినడానికి బిగ్ రూమర్ అయినా.. కృతి శెట్టి రేంజ్ మహేష్ పక్కన చేరింది. మహేష్ బాబు ఉప్పెన సినిమా చూసి హీరో - హీరోయిన్స్ పేరు పేరునా అభినందించిన సంగతి తెలిసిందే. అలా సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమాకి ముందు మహేష్ చెయ్యబోయే ఓ సినిమా కోసం కృతి శెట్టిని సంప్రదించబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి ఇప్పటికే మూడు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన కృతికి మహేష్ ఆఫర్ న్యూస్ మంచి కిక్కిచ్చే ఉంటుంది. 

Uppena Beauty in Superstar Movie:

Krithi Shetty in Mahesh Next 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ