RRR రిలీజ్ వరకు ఎన్టీఆర్ తెర మీద కనిపించడు, ప్రస్తుతం బయట కూడా కనిపించడం లేదనుకుంటే.. ఇప్పుడు బుల్లితెర మీద ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ వచ్చేస్తున్నాడు.బిగ్ బాస్ తోనే బుల్లితెర స్టార్ మాని షేక్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ జెమిని ఛానల్ లో కనిపించబోతున్నాడు. గతంలో నాగ్, చిరు హోస్ట్ గా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరులు ని.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని ఛానల్ ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ మొదలు పెట్టబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హోస్ట్ లో ఈ షో మొదలు కాబోతున్న ప్రోమో ని రిలీజ్ చేసింది జెమిని ఛానల్.
మరి యంగ్ అండ్ ఎనర్జిటిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటు, సూటులో స్టైలిష్ లుక్ లో అదరగొట్టడమే కాదు.. పవర్ ఫుల్ పంచ్ లతో ఇరగదీస్తున్నాడు. కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది అంటూ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో పై అందరిలో ఇంట్రెస్ట్ కలిగించేస్తున్నాడు. హాట్ సీట్ లో కూర్చోబోయేవారు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారో చెప్పకనే చెప్పేస్తున్న ఎన్టీఆర్ షో కోసం అందరూ ఆసక్తి తో ఎదురు చేసేలా ఉంది ఈ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో. కొమరం భీం ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్టేజ్ మీద సందడి చేస్తుంటే ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగ చేసుకుంటున్నారు.