RRR రిలీజ్ డేట్ ఇచ్చేసి రాజమౌళి RRR షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ రాజమౌళికి ఇస్తున్న సహకారంతో RRR షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసింది. అందుకే రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కి జంప్ అవగా.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి జంప్ అయ్యారు. రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులకి, విఎఫెక్స్ పనులకి టైం సెట్ చేసుకుంటున్నారు. ఇక RRR పబ్లిసిటీ విషయం కూడా రాజమౌళి పక్క గా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు అంటే మార్చి 27th కి రామ్ చరణ్ కి సంబందించిన లుక్ అలాగే ఓ స్పెషల్ టీజర్ ని రెడీ చేస్తున్నారు. అందుకే ఈలోపు రామరాజు సీత అంటే రామ్ చరణ్ జోడిగా నటిస్తున్న అలియా భట్ లుక్ ని మార్చి 15 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టీం అధికారిక ప్రకటన ఇచ్చింది.
మార్చి 15 న RRR నుండి సీత లుక్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా ట్వీట్ చేసింది RRR టీం. మార్చి 15 ఉదయం 11 గంటలకు అలియా భట్ సీత లుక్ ని రివీల్ చేస్తున్నారు. మరి RRR నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులోనూ పాన్ ఇండియా ఫిలిం. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన అలియా భట్ అప్ డేట్ RRR నుండి అంటే అటు హిందీ ప్రేక్షకులకు బోలెడంత క్యూరియాసిటీ. అందుకే RRR అప్ డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.