ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. తర్వాత చెయ్యాల్సిన చిత్రం రాజమౌళి దర్శకత్వంలో. సర్కారు వారి పాట షూటింగ్ అవ్వగానే మహేష్ షిఫ్ట్ అవ్వాల్సిన సినిమా జక్కన్నదే. కానీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం కంప్లీట్ చేసాక ఒక సినిమా గ్యాప్ అయితే మహేష్ కి ఇస్తున్నాడు. ఆ గ్యాప్ లో మహేష్ ఎవరితో సినిమా చేస్తాడు? అనిల్ రావిపూడితోనా? వంశీ పైడిపల్లితోనా? ఇలా వేరే వేరే డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇవేమి కాకుండా మరో కొత్త డైరెక్టర్ తో మహేష్ తన తదుపరి చిత్రాన్ని చెయ్యబోతున్నాడు.
ఆ కొత్త డైరెక్టర్ పేరు మీరు త్వరలోనే వినబోతున్నారు. మహేష్ బాబు కూడా మామూలోడు కాదు.. తన నెక్స్ట్ మూవీ ప్లానింగ్ విషయంలో చాలా సీరియస్ గానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తక్కువ వర్కింగ్ డేట్స్ లో సినిమా కంప్లీట్ చేసి ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వగలిగే డైరెక్టర్ ని లైన్ లో పెట్టాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఆ సన్సేషనల్ న్యూస్ వినబోతున్నాము. సర్కారు వారి పాట నెక్స్ట్ సినిమా తొందర తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు మహేష్. ఎందుకంటే రాజమౌళి ఇచ్చిన టైం లో మహేష్ నెక్స్ట్ పూర్తి చేసెయ్యాలి.. మళ్ళీ రాజమౌళి సినిమాకి ప్రిపేర్ అవ్వాలి.. ఇది మహేష్ ప్లాన్.