ఇప్పుడు కాదు.. ఒక రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ సినిమాల లిస్ట్ ఏమిటి అంటే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తో త్రివిక్రమ్ తో అలా వైకుంఠపురములో సినిమా. దాని తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్. అయితే ఐకాన్ ని పక్కనబెట్టిన అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ ని పింక్ రీమేక్ తో డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో.. అంత పెద్ద సినిమా వచ్చినప్పుడు మీరు అది చెయ్యండి.. నేను సుకుమార్ తో చేస్తాను అని చెప్పాడట. రంగస్థలం లాంటి పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్, అలాగే ఇండస్ట్రీకి దర్శకుడిగా తానే ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అని అడ్వాంటేజ్ తీసుకుని ఇటు సుకుమార్ సినిమాకి జంప్ అయ్యాడు అల్లు అర్జున్.
సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప తర్వాత.. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనుకుంటే.. కొరటాల శివ తో పాన్ ఇండియా మూవీ లైన్ లోకొచ్చింది. కొరటాల - అల్లు అర్జున్ కాంబో పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ చేస్తాడా? కాదు కొరటాలతో ముందుకు వెళ్ళిపోతాడా? అసలు ఆల్రెడీ వేణు శ్రీరామ్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్, ఓకె చేసిన స్క్రిప్ట్ అక్కడ ఉంది. అయితే వేణు శ్రీరామ్ తో పని చేసేది లేనిది.. పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ చేసిన వకీల్ సాబ్ హిట్ మీదే ఆధారపడి ఉంది. వకీల్ సాబ్ పెద్ద హిట్ అయ్యింది అంటే.. అల్లు అర్జున్ వెంటనే వేణు శ్రీరామ్ ఐకాన్ ని లైన్ లో పెట్టేస్తాడు. అదే వకీల్ సాబ్ గనక తేడా కొట్టింది అంటే.. రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన కొరటాల శివ ప్రాజెక్ట్ కి అల్లు అర్జున్ వెళ్ళిపోతాడు. ఇది అల్లు అర్జున్ ప్లే చేసే బ్రిలియెంట్ గేమ్.