Advertisementt

అప్పుడు 25 అని.. ఇప్పుడు 15 అంటున్నారు

Sun 14th Mar 2021 03:50 PM
anasuya,karthikeya,chaavu kaburu challaga movie,chaavu kaburu challaga special song,ansuya special song,remuneration,remuneration for item song  అప్పుడు 25 అని.. ఇప్పుడు 15 అంటున్నారు
Anasuya Remuneration For Item Song In Chaavu Kaburu Challaga Movie? అప్పుడు 25 అని.. ఇప్పుడు 15 అంటున్నారు
Advertisement
Ads by CJ

తన మీద వచ్చే పోసుకోలు కబుర్లకి, గాలి వార్తలకి సైలెంట్ గా చూస్తూ ఊరుకునే రకం కాదు.. తన మీద రూమర్స్ ప్రచారం చేసేవారిని. తన జోలికి వచ్చే వారిని చీల్చి చండాడేస్తుంది యాంకర్ అనసూయ. హీరోయిన్స్ అయితే పోనిలే రూమర్ కదా అని వదిలేద్దామనుకుంటారు. కానీ అనసూయ అలా కాదు.. తన జోలికి వచ్చిన వారిని లైవ్ షో పెట్టి మరీ తిడుతుంది. ఇకపోతే సినిమాల విషయం వచ్చేసరికి అనసూయ ఆచితూచి అడుగులు వేస్తుంది. అది ఐటెం సాంగ్ అయినా తనకి నచ్చితేనే చేస్తుంది. జానీ మాస్టర్ ఫ్రెండ్ అని బన్నీ వాస్ చెప్పాడని చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యలేదు. అనసూయ 25 లక్షల భారీ ఆఫర్ కి పడిపోయింది అన్నారు ఆ మధ్యన. అమ్మో మూడు రోజుల ఐటెం కి అనసూయ 25 లక్షలు అందుకుందనే ప్రచారం సాంగ్ వచ్చిన కొత్తల్లో జరిగింది.

కానీ ఇప్పుడు అదే రూమర్స్ క్రియేట్ చేసిన వారు ఆబ్బె.. లేదండి అనసూయ 25 లక్షల కోసం ఆ సాంగ్ చెయ్యలేదు. అసలు ఆ సాంగ్ కోసం అనసూయ డిమాండ్స్ ఏం లేవు.. జానీ మాస్టర్ అడిగారని, అనసూయకి సాంగ్ నచ్చింది అని, అలాగే చావు కబురు చల్లగా నిర్మాత బన్నీ వాస్ తో ఉన్న అనుబంధం కారణముగా అనసూయ ఆ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అనడమే కాదు.. ఆ సాంగ్ కోసం అనసూయకి కేవలం 15 లక్షలు ఇచ్చారని  చెబుతున్నారు. మరి మొన్న 25 అన్నవారు.. ఇప్పడు 15 అని మాట్లాడుతున్నారు. ఇందులో నిజం అనసూయే చెప్పాలమ్మ.

Anasuya Remuneration For Item Song In Chaavu Kaburu Challaga Movie?:

Telugu Anchor Anasuya Remuneration For Item Song in Chaavu Kaburu Challaga movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ