ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో తడబడ్డ జనసేన.. ఆ తప్పును కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్న జనసేనాని తెలంగాణ బిజెపి విషయంలో మాత్రం ఫైర్ అయ్యారు. తెలంగాణ బిజెపి లో ఎవరూ తనకి సరైన గౌరవం ఇవ్వలేదని, తమ జనసేన పార్టీని చిన్న చూపు చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అక్కడ తిరుపతిలో మాత్రం జనసేన - బిజెపి కూటమి అభ్యర్థికి ఓటెయ్యాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దానితో రాజకీయాలను కాస్త పక్కనబెట్టి కూల్ గా తప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో కానీ, తిరుపతి ఎలక్షన్స్ తో కానీ వేరే ఏటితోను సంబంధం లేదు.
ఇక ఇటు సినిమాల్లో బాగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేసవి తాపం తప్పించుకోవడానికి కరెక్ట్ గా సమ్మర్ వెకేషన్స్ అన్నట్టుగా పొల్లాచ్చి బయలుదేరబోతున్నారు. ఈమధ్యనే మొదలైన పవన్ కళ్యాణ్ - రానా కాంబో ఏకే రీమేక్ కోసం పొల్లాచ్చి వెళుతున్నారు పవన్ కళ్యాణ్. లాంగ్ షెడ్యూల్ లో పొల్లాచ్చి లోనే ఏకే రీమేక్ షూటింగ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్, ప్లానింగ్ మొత్తం అన్ని కూడా ఇలా ఆయనే ప్లాన్ చేసుకుంటారు. కరెక్ట్ గా డిజైన్ చేసుకుంటారు. అందుకే అనేది పవన్ కళ్యాణ్ ప్లానింగ్ అదుర్స్ అని.