మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చిత్రీకరణలో కాస్త బిజీగానే ఉన్నారు. కరోనా కారణంగా లేట్ గా మొదలైన సర్కారు వారి పాట షూటింగ్ కి ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా పరశురామ్ చిత్రీకరిస్తున్నారు. అయితే సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చెయ్యాల్సి ఉన్నప్పటికీ.. రాజమౌళి ఇచ్చే ఒక సినిమా గ్యాప్ కోసం మహేష్ బాబు.. మరో సినిమా ప్లాన్ చేసేసుకున్నారు. విత్ ఇన్ 60 డేస్ లో కంప్లీట్ అయ్యే మూవీ చెయ్యబోతున్నారు. అంత ఫాస్ట్ గా సినిమా చెయ్యగల డైరెక్టర్ ని మహేష్ చూజ్ చేసుకున్నారు.
ప్రస్తుతం ముంబైలో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ డైరెక్టర్.. కరణ్ జోహార్ సపోర్ట్ తో మహేష్ బాబు సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కృష్ణ గారి అబ్బాయి- శ్రీదే గారి అమ్మాయి.. ఈ కాంబినేషన్ ని స్క్రీన్ మీద చూపించాలనేది ఆ డైరెక్టర్ ప్లానింగ్. ఎప్పటినుండో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై వార్తలొస్తున్నా.. ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ హీరోయిన్ గా మాత్రం జాన్వీ ని తెలుగుకి తీసుకొచ్చే ప్రయత్నాలు సదరు డైరెక్టర్ గట్టిగానే చేస్తున్నారట. మరి కృష్ణ - శ్రీదేవి కాంబినేషన్ లా మహేష్ - జాన్వీ జోడి ఎన్ని రికార్డులని సృష్టిస్తుందో చూడాలి.