బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయన ఎనర్జీ.. ఆయన నటించే సినిమాల్లోని డాన్స్ లోనూ, ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ లోనే తెలిసిపోతుంది. బాలయ్య అంటే ఎనర్జీ. అదే విషయాన్నీ ఇప్పుడో హీరోయిన్ కూడా చెబుతుంది. ఆమె ఎవరో కాదు.. BB3 లో బాలయ్య సరసన నటిస్తున్న ప్రగ్య జైస్వాల్. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రగ్య జైస్వాల్ కి బోయపాటి, బాలయ్య BB3 లో ఆఫర్ ఇచ్చాడు. అందుకే పాప బాగా ఎగ్జైట్ అవుతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత తాను నటిస్తున్న సినిమా BB3 నే అని.. బోయపాటి జయ జానకి నాయక సినిమాలో తాను నటించానని ఇప్పుడు మళ్లి BB3 లో నటిస్తున్నా అని.. బోయపాటి తో వర్క్ చెయ్యడం చాలా కంఫర్ట్ గా ఉంది అని చెబుతుంది ప్రగ్య.
అంతేకాకుండా బాలకృష్ణ తో నటించడం కొత్తగాను, అద్భుతంగానూ ఉందని.. ఎందుకంటే బాలయ్య ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారని.. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా సెట్ లో పాజిటివిటీతో ఉల్లసంగా ఉంటారని, సినిమాల పట్ల బాలకృష్ణ కి ఉన్న అభిరుచికి ఎవరూ సాటిరారు అంటూ బాలయ్య ఎనర్జీని ఎత్తేస్తుంది ప్రగ్య జైస్వాల్. ఇక దర్శకుడు బోయపాటికి కథ పట్ల ఉన్న విజన్, స్పష్టత ఎంతో స్ఫూర్తిదాయకం అంటుంది ప్రగ్య జైస్వాల్.. ఇక గాడ్ ఫాదర్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న BB3 మే 28 న విడుదల కాబోతుంది.