Advertisementt

ఒక్క ఫొటోతో పూజ హెగ్డే ని తొక్కేసింది

Wed 17th Mar 2021 09:40 PM
pooja hegde,badsha,rashmika mandanna,top tucker song,bollywood,pan india movies,pushpa movie,radhe shyam movie  ఒక్క ఫొటోతో పూజ హెగ్డే ని తొక్కేసింది
pooja Hegde vs Rashmika Mandanna ఒక్క ఫొటోతో పూజ హెగ్డే ని తొక్కేసింది
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఒకరికొకరు కాంపిటీటర్స్ గా మారారు.. ఇద్దరూ పోటా పోటీగా స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. పారితోషకాల్లో పోటీ పడ్డారు. వాళ్లెవరో కాదు రష్మిక - పూజ హెగ్డే లు. కన్నడ నుండి దూసుకొచ్చిన రష్మిక తెలుగులో స్టార్ హీరోలతో పాటుగా పాన్ ఇండియా ఫిలిం తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మరోపక్క టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించిన పూజ హెగ్డే కూడా పాన్ ఇండియా మూవీ తో పాటుగా బాలీవుడ్ లోనూ బిజీ అయ్యింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా అందరితో నటించిన పూజ హెగ్డే రష్మిక మీద క్రేజ్ విషయంలోనూ పారితోషకం విషయంలో ఓ మెట్టు ఎక్కువే ఉంది. అయితే ఈ ఏడాది పూజ vs రష్మిక అన్నట్టుగా ఉంది వ్యవహారం. పూజ ప్రభాస్ తో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ చేస్తుంటే.. రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తుంది.

మరోపక్క పూజ హెగ్డే బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 తో హిట్ కొట్టి అటు రణ్వీర్ సింగ్ ఇటు సల్మాన్ ఫిలిమ్స్ లో నటిస్తుంటే.. రష్మిక బాలీవుడ్ యంగ్ హీరోస్ అంటే మిషన్ మంగళ్ లో సిద్ధార్ధ్ మల్హోత్ర కి జోడిగా నటిస్తుంది. అలాగే అమితాబ్ సినిమాలో కీలక పాత్రలో రష్మిక కనిపించబోతుంది. అయితే తనకన్నా క్రేజ్ లోనూ, ఫేమ్ లోనూ ఓ అడుగు ముందున్న పూజ హేగ్డ్ ని ఇప్పుడు రష్మిక ఓ ఫోటో తో తొక్కేసింది. బాలీవుడ్ కి ఎంటర్ అయ్యాక రష్మిక టాప్ టక్కర్ అనే ప్రైవేటు ఆల్బమ్ లో నటించింది. ఆ సాంగ్ తో రష్మిక బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సాంగ్ హిట్ అయ్యి భామకి క్రేజ్ వచ్చేసింది. అదంతా అలా ఉంటె.. ఆ ఆల్బమ్ కోసం రష్మిక చేయించుకున్న ఫోటో షూట్ లో ఓ ఫోటో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పిక్ లో రష్మిక తలపాగాతో రెండు చేతులు పెట్టి నవ్వుతూ ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

అంతేకాదు రష్మిక తలపాగా ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోగా రికార్డులకు ఎక్కింది. ఈ ఒక్క దెబ్బతో రష్మిక క్రేజ్ పెరగడమే కాదు.. హిందీ జనాలు రష్మిక గురించి గూగుల్ సెర్చింగ్ మొదలు పెట్టారు. ఆ ఒక్క సాంగ్ తో పూజ మీదున్న గాలి రష్మిక మీద వాలింది. దెబ్బకి రష్మిక క్రేజ్ బాలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోయింది.

pooja Hegde vs Rashmika Mandanna:

Badshah And Rashmika Mandanna Top Tucker Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ