Advertisementt

విజయ్ సేతుపతి ప్లేస్ లో నాగ చైతన్య

Wed 17th Mar 2021 10:22 PM
laal singh chaddha,naga chaitanya,ameer khan,vijay sethupathi,chaitanya to join laal singh  విజయ్ సేతుపతి ప్లేస్ లో నాగ చైతన్య
Laal Singh Chaddha: Naga Chaitanya To Fill In For Vijay Sethupathi role విజయ్ సేతుపతి ప్లేస్ లో నాగ చైతన్య
Advertisement
Ads by CJ

సమంత ముంబై లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నప్పటి నుండి నాగ చైతన్య బాలీవుడ్ కి వెళ్లబోతున్నాడు, భార్య సమంత అడుగుజాడల్లో చైతు నడవబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరోపక్క సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ - డీకే ద్వయంతో అఖిల్ సినిమా సెట్ చేసింది అనే ప్రచారమూ ఉంది. అయితే మధ్యలో నాగ చైతన్య -విక్రమ్ కుమార్ థాంక్యూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ చైతు పై బాలీవుడ్ వార్తలు ఆగడం లేదు. రీసెంట్ గా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ఫరాహ్ ఖాన్ తో నాగ చైతన్య దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 15 ఏళ్ళ క్రితం తండ్రి నాగ్ తో చేసిన నేను మళ్ళీ ఆయన కొడుకు చైతూతో అంటూ ఆ పిక్ పోస్ట్ చేసింది ఫరా ఖాన్.

అయితే నాగ చైతన్య ముంబై వెళ్ళింది అమీర్ ఖాన్ సినిమాలో నటించడానికి అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్. ఫారెస్ట్ గంప్కి రీమేక్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య నటించబోతున్నాడట. గతంలో లాల్ సింగ్ చద్దా లో విజయ్ సేతుపతి ఓ పాత్రకి ఎంపికయ్యారు. కానీ విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చైతు వచ్చాడంటున్నారు. విజయ్ సేతుపతి వదిలేసిన పాత్రని నాగ చైతన్య ని సంప్రదించగా.. చైతు ఓకె చెప్పాడనే టాక్ మొదలైంది. గతంలో నాగ్ అప్పుడప్పుడు హిందీ మూవీస్ లో నటించినట్లే.. చైతూ కూడా వీలున్నప్పుడు ఇలా హిందీకి వెళ్ళొద్దామని డిసైడ్ అయ్యాడట. అందుకే అమీర్ మూవీలో నటించబోతున్నాడని తెలుస్తుంది. 

Laal Singh Chaddha: Naga Chaitanya To Fill In For Vijay Sethupathi role:

Chaitanya to join Laal Singh...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ