Advertisementt

పుష్ప ఐటెమ్ సాంగ్ అద్దిరిందట

Fri 19th Mar 2021 01:37 PM
allu arjun,mas fans,pushpa pan india film,sukumar,devi sri prasad,bunny,item song,pushpa item song,pushpa movie,bunny pushpa movie,allu arjun pushpa movie  పుష్ప ఐటెమ్ సాంగ్ అద్దిరిందట
Pushpa item song throughout పుష్ప ఐటెమ్ సాంగ్ అద్దిరిందట
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ ఎలాంటి విరామం తీసుకోకుండా యమా ఫాస్ట్ గా చిత్రీకరిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్ కూడా చిన్నపాటి గ్యాప్ తీసుకోకుండా పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 13 న రిలీజ్ కాబోతుంది. అయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఇరగదీసే ఫైట్స్, అదిరిపోయే పాటలు, బన్నీ స్టయిల్లో చితక్కొట్టేసే స్టెప్స్.. ఇది అందరికి తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా ఐటెం సాంగ్ అనేది.. అ అంటే.. అమలాపురం అన్నా, రింగ రింగ అన్నా ఒక రేంజ్ లో ఊపేస్తాయి. మాస్ ఫాన్స్ బన్నీ ఐటెం సాంగ్స్ చూస్తే ఊగిపోతుంటారు.

ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత బన్నీ - సుక్కు చేస్తున్న ఈ పుష్ప సినిమాకి మళ్ళీ అలాంటి ఇంకో అద్భుతమైన ఐటెం సాంగ్ ని సెట్ చేసారంట. అందులోనూ బన్నీ లాంటి అగ్నికి దేవిశ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆజ్యం తోడైతే మాములుగా ఉండదు కదా. ఓ అద్భుతమైన ఐటెం ట్యూన్ ఆల్రెడీ ఓకె అయ్యిపోయింది. ఆ సాంగ్ మాత్రం మాములుగా లేదంట. కనీసం ఓ నాలుగైదేళ్ళ అయినా మార్మోగే రేంజ్ లో బీట్ ఓరియెంటెడ్ సాంగ్ గా ఉండబోతుందట. బన్నీ ఎనర్జీని, డాన్స్ ను ఛాలెంజ్ చేసే రేంజ్ లో దేవిశ్రీ ప్రసాద్ దరువేసాడంట. దాన్నిమన సుక్కు ఎలా తెరకెక్కిస్తాడో తెలిసిందే కదా.. గెట్ రెడీ ఫాన్స్.

Pushpa item song throughout:

Pushpa Movie Item Song Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ