Advertisementt

నాగ చైతన్య తో ఇస్మార్ట్ బ్యూటీ

Fri 19th Mar 2021 08:04 PM
nabha natesh,ismart beauty,romance,naga chaitanya,vikram kumar,thank you movie,naga chaitanya thank you movie  నాగ చైతన్య తో ఇస్మార్ట్ బ్యూటీ
Nabha Natesh to Romance Naga Chaitanya నాగ చైతన్య తో ఇస్మార్ట్ బ్యూటీ
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నితిన్ తో అంధధూన్ సినిమా రీమేక్ లో నటిస్తున్న నభ నటేష్ ఇప్పుడు నాగ చైతన్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. నాగ చైతన్య - శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. మనం తర్వాత చైతు - విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న థాంక్యూ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. అందులో ఒక హీరోయిన్ గా చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

మరో ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్ అవ్వాల్సి ఉండగా.. అందులో సమంత కూడా ఓ హీరోయిన్ గా నటించబోతుంది అనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం ఇస్మార్ట్ పోరి నభ నటేష్ మరొక హీరోయిన్ గా నాగ చైతన్య సరసన ఫిక్స్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ కి జోడిగా గ్లామర్ తో అదరగొట్టిన నభ నటేష్.. ఇప్పుడు చైతూతో కలిసి అదరగొట్టబోతుంది. ఇప్పటికే నభ నటేష్ ,చైతూ థాంక్యూ సినిమాకి సంతకం కూడా చేసేసింది. త్వరలోనే నభ థాంక్యూ షూటింగ్ లో పాల్గొనబోతుంది.

Nabha Natesh to Romance Naga Chaitanya:

Nabha Natesh to Romance Naga Chaitanya in thank You Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ