Advertisementt

అడివి శేష్ హిట్ 2 లుక్

Sat 20th Mar 2021 11:32 AM
adivi sesh,krishna das,nani producer,adivi sesh hero,hit 2,hit 2 title poster  అడివి శేష్ హిట్ 2 లుక్
Adivi Sesh Hit 2 Title Poster అడివి శేష్ హిట్ 2 లుక్
Advertisement
Ads by CJ

నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. అప్పట్లోనే హిట్ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని నాని ప్రకటించినా.. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. అయితే హీరోగా విశ్వక్ సేన్ హిట్ సీక్వెల్ లో హీరోగా కంటిన్యూ అవ్వడం లేదు. ఇలాంటి థ్రిల్లర్స్ కి స్పెషలిస్ట్ అయినా అడివి శేష్ హీరోగా హిట్ 2 ఎనౌన్సమెంట్ వచ్చేసింది. అడవి శేష్ క్రిష్ణ దాస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకాబోతుంది.

అయితే హిట్ సినిమా తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కగా.. హిట్ 2 ఏపీ లో నేపథ్యంగా సాగనుందట. ఇక హీరోయిన్ గా హిట్ సినిమాలో విశ్వక్ సేన్ తో కనిపించిన అమ్మాయి కాకుండా హిట్ 2 లో అడవి శేష్ కి జోడిగా  మీనాక్షి చౌద‌రి నటించబోతుంది. మరి క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అడవి శేష్ తనకంటూ ఓ స్పెషల్ జోనర్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బ్యానర్ లో మేజర్ పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న అడివి శేష్ తో హిట్ సీక్వెల్ అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం హిట్ 2 ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది టీం.

Adivi Sesh Hit 2 Title Poster:

Adivi Sesh As Krishna Das In Hit 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ