Advertisementt

పవర్ స్టార్ లేకుండానే..

Sat 20th Mar 2021 12:14 PM
vakeel saab movie,power star pawan kalyan,vakeel saab promotions,pawan vakeel saab,s.s.thaman  పవర్ స్టార్ లేకుండానే..
Vakeel Saab Promotion started పవర్ స్టార్ లేకుండానే..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి ఏకే రీమేక్ కోసం పొల్లాచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. 10 రోజుల పాటు క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సర్దుబాటు చేసుకుని.. ఏకే రీమేక్ షూటింగ్ కోసం పొల్లాచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్దమవుతుంది. ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది టీం. దర్శకుడు వేణు శ్రీరామ్- రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు వకీల్ సాబ్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఇక దిల్ రాజు కూడా వకీల్ సాబ్ ప్రమోషన్స్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ రోజు MLRIT కాలేజ్ దుండిగల్ లో వకీల్ సాబ్ మ్యూజిక్ ఫెస్ట్ ని ఏర్పాటు చేసారు. థమన్, దర్శకుడు వేణు శ్రీరామ్ లు వకీల్ సాబ్ మ్యూజిక్ ఫెస్ట్ లో సందడి చెయ్యబోతున్నారు. అయితే ఏప్రిల్ 3 న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. దాదాపుగా రెండు కోట్లతో వకీల్ సాబ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎప్పుడూ తన సినిమా ఈవెంట్స్ కి కానీ, ప్రమోషన్స్ కి రాని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లోనూ కనిపించడం లేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం హాజరవుడని తెలుస్తుంది. దిల్ రాజు కోరిక మేరకు పవన్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హైదరాబాద్ రాబోతున్నారు. వకీల్ సాబ్ ఈవెంట్ కోసం చాలామంది గెస్ట్ లను పిలవబోతున్నాడు దిల్ రాజు. అసలు అందరికన్నా పెద్ద గెస్ట్ పవన్ ఉండగా.. మిగతా గెస్ట్ లెందుకు అంటున్నారు పవన్ ఫాన్స్.

Vakeel Saab Promotion started:

Pawan Kalyan Vakeel Saab Promotion started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ