ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం తోనూ, తండ్రి ఆచార్య సినిమాలో నటించడమే కాకుండా అటు నిర్మాతగానూ అభిరుచిని చాటుకుంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టిన రోజు వేడుకలకి టైం, డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చ్ 27 న పుట్టిన రోజు జరుపుకోబోతున్న రామ్ చరణ్ కి అటు ఆచార్య నుండి ఇటు ఆర్.ఆర్. ఆర్ నుండి స్పెషల్ సర్ప్రైజ్ లు రెడీ కాబోతున్నాయి. ఇంకా రామ్ చరణ్ తదుపరి పాన్ ఇండియా మూవీ శంకర్ డైరెక్షన్ లో అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. ఇప్పడు చరణ్ బర్త్ డే రోజున శంకర్ - చరణ్ మూవీ టైటిల్ లేదా లుక్ ని కూడా వదులుతారనే టాక్ ఉంది.
అయితే సినిమాల నుండి రామ్ చరణ్ లుక్స్, స్పెషల్ సర్ప్రైజెస్ ఎలా ఉన్నా.. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలని ఒక రోజు ముందుగా ప్లాన్ చేసేసారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు మార్చి 26 సాయంత్రం గ్రాండ్ లెవల్లో జరగబోతున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబందించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలని అంగరంగ వైభవంగా ఫాన్స్ కోసం నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ ఇంకొంతమంది మెగా హీరోలు ఈ సెలెబ్రేషన్స్ కి రావొచ్చని అంటున్నారు.