సూర్య పేటలో 47 వ జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ కబడ్డీ పోటీల నిర్వహణకు గాను మైదానం లో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేసారు. 20 అడుగుల ఎత్తు 240 అడుగుల వెడల్పుతో గ్యాలరీ లను ఏర్పాటు చేసారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి క్రీడాకారులు వచ్చారు. అయితే పోటీ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కాసేపట్లో కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతాయనగా అక్కడి గ్యాలరీ లో సామర్ధ్యానికి మించి ప్రేక్షకులు ఉండడంతో ఆ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఒక్కసారిగా కుప్ప కూలడంతో..100 మందికి పైగా గాయాలు పాలైనట్లుగా తెలుస్తుంది. అందులో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో వారిని హైదరాబాద్ కి తరలించి వైద్యం అందిస్తున్నట్టు సమాచారం.
మిగతా వారికి సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గ్యాలరీలో పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. ఆ గ్యాలరీలకు ఉపయోగించిన ఇనప రాడ్లు తగిలి చాలామందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆ ఇనప రాడ్లు కాళ్ళ మీద పడడంతో తీవ్రగాయాలు పాలైనట్లుగా తెలుస్తుంది.