కెరీర్ లో ఎంతో ఎఫర్ట్స్ పెట్టిన చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్, అఖిల్ తో మాస్ హీరోగా లాంచ్ అయిన అక్కినేని అఖిల్ ఆ తర్వాత లవర్ బాయ్ గా చేసిన రెండు చిత్రాలు హలో, మిస్టర్ మజ్ను ప్లాప్ అవడంతో ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ పర్యవేక్షణలో అఖిల్ కి ఈసారి హిట్ గ్యారెంటీ అని నాగార్జున కూడా నమ్ముతున్నాడు. కాబట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విషయంలో నాగ్ ఎలాంటి వేళ్ళు పెట్టడం లేదు. అంతా అల్లు అరవింద్ కె అప్పజెప్పేసాడు. అయితే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చెయ్యబోయే సినిమా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది.
అఖిల్ ని పవర్ ఫుల్ రోల్ లో చూపించడమే కాకుండా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు సురేందర్ రెడ్డి. అయితే ఇప్పుడు అఖిల్ సోషల్ మీడియాలో రేపు మీకో సర్ప్రైజ్.. బిగ్ న్యూస్ అవుట్ టుమారో అంటూ గాల్లో ఎగురుతున్న ఫోటో ని పోస్ట్ చేసాడు. ఈ న్యూస్ చెప్పడానికి నేనెంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాను.. మీరు ఊహించని న్యూస్ చెప్పబోతున్నా.. జస్ట్ 24 గంటలు వెయిట్ చెయ్యండి.. గెట్ రెడీ అంటూ ఊరిస్తున్నాడు. మరి అఖిల్ రేపు చెప్పబోయే ఆ న్యూస్ సురేందర్ రెడ్డి మూవీ గురించా? లేదంటే మరో కొత్త విషయం ఏమైనా చెప్పబోతున్నాడా? అనే క్యూరియాసిటిలో అక్కినేని ఫాన్స్ ఉన్నారు.