రేపు శుక్రవారం రానా నటించిన పాన్ ఇండియా ఫిలిం అరణ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉంది. సౌత్ లో అరణ్య మూవీ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అరణ్య ట్రైలర్ లాంచ్, అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేసారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్, శేఖర్ కమ్ముల గెస్ట్ లుగా హాజరయ్యారు. మరోపక్క రానా ఇంటర్వూస్ జరుగుతున్నాయి. అరణ్యపై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు మార్చి 26 న విడుదల కాబోతున్న రానా అరణ్య కి కరోనా బ్రేకులు వేసింది. నార్త్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో అరణ్య హిందీ వెర్షన్ హథీ మేరే సాథి అక్కడ మార్చ్ 26 న విడుదల చెయ్యడం లేదు.
కేవలం హిందీలోనే అరణ్య ని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. తెలుగు, తమిళ్ లో యధావిధిగా అరణ్య మార్చ్ 26 న థియేటర్స్ లోకి రాబోతుంది. హిందీలో మాత్రం వాయిదా వెయ్యడం, మరో రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామంటూ అరణ్య మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవలు ప్రకటించాయి ఆయా ప్రభుత్వాలు. అందుకే ఎందుకైనా మంచిది.. ఎలాగూ హిందీ మార్కెట్ డల్ గా ఉండడంతో అరణ్య హిందీ వెర్షన్ ని పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది.