Advertisementt

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రభాస్ హీరోయిన్

Tue 23rd Mar 2021 09:49 PM
sanjana galrani,secret marriage,to dr. pasha,prabhas heroine,puri,bujjugadu movie second heroine,sanjana getting married  సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రభాస్ హీరోయిన్
Prabhas Heroine Secret Marriage సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ప్రభాస్ హీరోయిన్
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బుజ్జిగాడు మూవీ లో సెకండ్ హీరోయిన్ గా పరిచయం అయిన సంజన గల్రాని.. సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫోకస్ అవుతుంది. టాలీవుడ్ లో అవకాశాలు రాక, లేక కన్నడ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటే.. అక్కడ డ్రగ్స్ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది శాండిల్ వుడ్ ని పట్టి కుదిపేసిన డ్రగ్స్ కేసులో సంజన గల్రాని జైలుకెళ్లింది. దాదాపుగా మూడు నెలలపాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటికొచ్చిన సంజన.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా మారింది. రోజుకో ఫోటో షూట్ తో నానా హంగామా చేస్తుంది. 

మళ్ళీ సినిమా అవకాశాలు కోసం ట్రై చేస్తుంది సంజన అనుకున్నారు. మధ్యలో సంజన పెళ్లి టాపిక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సినిమా అవకాశాలు లేని సంజన త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అన్నారు. కానీ ఈ విషయమై సంజన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు సంజన సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుని కూసింత షాకిచ్చింది. కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషాను సంజన పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సంజన ద్రువీకరించడమే కాదు.. పెళ్లి ఫోటో ని షేర్ చేసింది. సంజన సీక్రెట్ వివాహానికి కొద్దిమంది స్నేహితులు, బంధువులు హాజరయ్యారని తెలుస్తోంది.

Prabhas Heroine Secret Marriage:

Sanjana Galrani Married To Dr. Pasha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ