Advertisementt

థియేటర్స్ మూసివెయ్యాలనే ప్రతిపాదన

Wed 24th Mar 2021 09:43 AM
coronam telangana sate,movie theaters,schools,collages,virous second wave  థియేటర్స్ మూసివెయ్యాలనే ప్రతిపాదన
Proposal to close theaters థియేటర్స్ మూసివెయ్యాలనే ప్రతిపాదన
Advertisement
Ads by CJ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయింది అనే ఆందోళనలో నిపుణులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో లెక్కకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నార్త్ లో కరోనా సెకండ్ వెవ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఏడాది ఇదే టైం కి కరోనా ఉధృతి ఎలా ఉందొ.. ఈ ఏడాది మళ్ళీ కరోనా ఉదృతి రోజు రోజుకి పెరిగిపోవడంతో.. తెలంగాణ లోని విద్య సంస్థలను మూసి వేసింది ప్రభుత్వం.  ఈ రోజు నుండి విద్యాసంస్థలు మూత బడ్డాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ మూసివెయ్యాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. 

సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు మాస్క్ లు లేకుండా, ఒకరి పక్కన ఒకరు కూర్చుంటున్నారని, ఒకే హాల్ లో వందల్లో ప్రేక్షకులు ఉంటున్నారు, అలాగే తలుపులు మూసి ఏసీ వేస్తుంటే.. కరోనా మరింతగా పెరిగే అవకాశం ఉంది అని ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదికలు సంపర్పించింది. ప్రేక్షకులు కొన్ని నిబంధలనలు పాటించాల్సి ఉన్నా అది గాలికి వదిలేస్తున్నారని.. ఒకవేళ థియేటర్స్ మూసివెయ్యడమనేది సాధ్యం కాకపోయినా.. కనీసం సీటింగ్ సామర్ధ్యాన్ని తగ్గించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు పంపింది. మరి స్కూల్స్, కాలేజెస్ అన్నీ మూతబడ్డాయి.. మరి ఇప్పుడు థియేటర్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందో అనే ఆసక్తిలో ప్రేక్షకులు ఉన్నారు. గత ఏడాది మార్చి 20 న మూతబడిన థియేటర్స్ మళ్ళీ డిసెంబర్ లో ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.

Proposal to close theaters:

Proposal to close theaters

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ