బాలీవుడ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడడం, అలాగే దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి కరోనా పాజిటివ్ రావడంతో అలియా భట్ కరోనా టెస్ట్ చేయించుకుని హోం క్వారంటైన్ కి వెళ్ళిపోయింది. ఇక నిన్న కార్తీక ఆర్యన్ కి కరోనా పాజిటివ్ రావడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రోజు రోజుకి బాలీవుడ్ ఇండస్ట్రీ మీద కరోనా దాడి ఎక్కువడడంతో అక్కడ స్టార్స్ బిక్కు బిక్కుమంటున్నారు. రణబీర్ కపూర్ కి కరోనా బారిన పడడంతో ఆయన నటించిన బ్రహ్మాస్త్ర పబ్లిసిటీ ఆగిపోయింది.
ఇక నేడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయనతో షూటింగ్ చేసిన కియారా అద్వానీ కరోనా టెస్ట్ కోసం పరుగులు పెట్టింది. అమీర్ ఖాన్ కి ఎలాంటి సింటెమ్స్, ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేవని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, హోమ్ ఐసోలేషన్ లో అమీర్ రెస్ట్ తీసుకుంటున్నారట. ఇక కియారా అద్వానీ కరోనా టెస్ట్ ఇచ్చి ఆమె కూడా హోమ్ క్వారంటైన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. నార్త్ లో కరోనా పంజా విసిరింది. స్టార్ ఇలా కరోనా బారిన పడడంతో చాలా సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడుతున్నాయి. అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా గత ఏడాది కరోనా కారణంగానూ, అమీర్ ఖాన్ హెల్త్ ఇష్యూ తో వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఆయనకి కరోనా సోకడంతో ఆ సినిమా వాయిదా పడక తప్పలేదు.