Advertisementt

మార్చ్ 29 న సోషల్ మీడియా షేకవ్వాల్సిందే

Wed 24th Mar 2021 06:09 PM
power star pawan kalyan,vakeel saab movie,vakeel saab trailer launch,march 29th,vakeel saab events,vakeel saab movie review  మార్చ్ 29 న సోషల్ మీడియా షేకవ్వాల్సిందే
Vakeel Saab trailer launch on March 29th మార్చ్ 29 న సోషల్ మీడియా షేకవ్వాల్సిందే
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని  శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్  9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రోజు ఉదయమే వకీల్ సాబ్ నుండి బిగ్గెస్ట్ అప్ డేట్ అంటూ అనౌన్స్ చేసి.. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ అప డేట్ ని రివీల్ చేసింది టీం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.  దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. 

వకీల్ సాబ్ నుండి ఏ అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు వకీల్ సాబ్ ట్రైలర్ ని కూడా సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉంచే ప్లాన్స్ లో పవన్ ఫాన్స్ ఉన్నారు. వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కాగానే ఇంతకుముందు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టేలా వారు ప్లాన్ చేస్తున్నారు.  ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్.

ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి. ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. 

Vakeel Saab trailer launch on March 29th:

Powerstar Pawan Kalyan Vakeel Saab trailer launch on March 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ