Advertisementt

సుల్తాన్ ట్రైల‌ర్: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్

Sun 28th Mar 2021 07:12 PM
karthi,rashmika,sulthan movie,sulthan movie trailer,sulthan movie trailer review  సుల్తాన్ ట్రైల‌ర్: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
Karthi Sulthan Trailer Launch సుల్తాన్ ట్రైల‌ర్: పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
Advertisement
Ads by CJ

కార్తి, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ సుల్తాన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా టీజర్‌, పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ రోజు సాయంత్రం సుల్తాన్ ట్రైల‌‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. కార్తీ మాస్ పవర్ ఫుల్ హీరోగా యాక్షన్ కుమ్మేస్తే.. రష్మిక లంగా ఓణీతో ఇరగదీసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..

అది ఒక ఏనుగు గుంపు..అంటూ  విల‌న్ (కె.జి.యఫ్ ఫేమ్ రామ‌చంద్రరాజు) వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభ‌మైన రెండు నిమిషాల ప‌ద‌హారు సెకండ్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఆధ్యంతం ఎంటర్‌టైనింగ్ గా సాగింది. హీరోయిన్ ర‌ష్మిక ప‌ల్లెటూరి యువ‌తి క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. త‌మిళ సీనియ‌ర్ యాక్టర్ నెపోలియ‌న్‌, మ‌ల‌యాళం పాపుల‌ర్ యాక్టర్ లాల్ పాత్రలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పట్లాగే  యోగిబాబు మ‌రోసారి ట్రైల‌ర్‌లో న‌‌వ్వులు పూయించారు. ఏదో కార‌ణం చేత త‌మ ఊరికి వ‌చ్చిన వంద‌మంది రౌడిల‌ను లీడ్‌చేసే సుల్తాన్‌గా కార్తి క‌నిపిస్తున్నారు. వివేక్ మెర్విన్ నేపథ్య సంగీతం, స‌త్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ఈ ట్రైల‌ర్‌ను మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. మొత్తంగా ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఏప్రిల్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్రాల్లో కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ ద్వారా వ‌రంగ‌ల్ శ్రీ‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కార్తి కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్స్‌ల‌లో ఈ మూవీ రిలీజ‌వుతుంది.

Karthi Sulthan Trailer Launch:

Karthi - Rashmika Sulthan Trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ