రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆర్.ఆర్.ఆర్ పై అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ భీబత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. రాజమౌళి ఇద్దరి స్టార్స్ అభిమానులని డిస్పాయింట్ చెయ్యడు.. అది అందరికి తెలుసు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా ఈ సినిమాలో తమ పెరఫార్మెన్స్ తో ఫాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రేడి అవుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అటు కొమరం భీం ఫాన్స్, ఇటు అల్లూరి ఫాన్స్ తమ హీరోలను ట్రేండింగ్ లోకి తీసుకొచ్చారు. రేపు రామ్ చరణ్ బర్త్ డే వేడుకల సంబరాలు ఈ రోజే మొదలయ్యాయి. అలా రామ్ చరణ్ అల్లూరి హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
అయితే ఎన్టీఆర్ ని కూడా ఫాన్స్ ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారు. ఎలా అంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్ గా చెయ్యబోతున్నాడు. దానికి సంబందించిన ప్రోమోస్ ఎప్పుడు రిలీజ్ చేసినా అవి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ ట్రేండింగ్ లోకి తెస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు మొదటి ప్రశ్న మార్చ్ 29 రాత్రి 8.15 నిమిషాలకు అంటూ ఎన్టీఆర్ చెబుతున్న ప్రోమో జెమిని టీవీ రిలీజ్ చేసింది. దానితో ఎన్టీఆర్ #EvaruMeeloKoteeswarulu ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం RRR హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల #EvaruMeeloKoteeswarulu, #SeethaRAMaRajuCHARAN లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి RRR హీరోలిద్దరి ఫాన్స్ తమ హీరోలను ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చూసుకుంటున్నారు.