సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమాని డైరెక్ట్ చేసి.. మైత్రి మూవీస్ కి బిగ్గెస్ట్ హిట్ అందించాడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా గత ఏడాదే విడుదల కావల్సిఉండగా.. లాక్ డౌన్ వలన వాయిదా పడింది. ఎన్ని ఓటిటి ఆఫర్స్ వచ్చినా సినిమాపై నమ్మకంతో నిర్మాతలు ఉప్పెన సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 12 న విడుదలైన ఉప్పెన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిల పెరఫార్మెన్స్, బుచ్చి బాబు మేకింగ్ అన్ని సినిమాకి హెల్ప్ అవడంతో ఉప్పెన భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి మైత్రి మూవీస్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. మరి అంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకులకి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చాలా మాములు విషయం అయ్యిపోయింది.
ఛలో హిట్ అయ్యాక వెంకీ కుడుములకి నాగ సౌర్య ఫ్యామిలీ కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇస్తే.. బాద్ షా టైం లో పూరికి ఎన్టీఆర్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక నాన్నకు ప్రేమతో హిట్ అప్పుడు నిర్మాతలు సుకుమార్ కి కారు గిఫ్ట్ ఇచ్చారు. జనతా గారేజ్ టైం లో కొరటాలకు ఎన్టీఆర్ భారీ గిఫ్ట్ ఇచ్చాడనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కి మైత్రి మూవీస్ నిర్మాతలు సుమారు 60లక్షలకు పైగానే విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీయల్సీ కారును గిఫ్ట్ గా ప్రెజెంట్ చేసారు. ఆ కాస్ట్లీ కారు గిఫ్ట్ గా అందుకున్న బుచ్చిబాబు తన గురువుగారు సుకుమార్ ని ఎక్కించుకుని టెస్ట్ రైడ్ కి వెళ్ళిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క హిట్ బుచ్చి బాబు ఫేట్ మార్చడం అంటే ఇదే మరి.