అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న థియేటర్స్ లోకి రాబోతుంది. గత 15 రోజుల నుండి వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో నాగార్జున యంగ్ స్టర్స్ లాగా సందడి చేస్తున్నారు. ఛానల్స్ కి ఇంటర్వూస్, వైల్డ్ డాగ్ స్పెషల్ ప్రమోషన్స్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. ప్రతి యూట్యూబ్ ఛానల్ కి నాగ్ వైల్డ్ డాగ్ స్పెషల్ ఇంటర్వూస్ అంటూ మాములుగా లేదు. ఇక తాజాగా వైల్డ్ డాగ్ నుండి ఓ ప్రోమోని వదిలింది టీం. అందులో నాగ్ విజయ్ వర్మ గా పవర్ ఫుల్ కేరెక్టర్ లో టెర్రరిస్ట్ లని పట్టుకుని.. ఎదో ఒక కారణంగా వదిలెయ్యడం కరెక్ట్ కాదంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
1989లో అప్పటి హోం శాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సైయిద్ కూతురును టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే దానికి బదులుగా 19 టెర్రరిస్టులను విడిచిపెట్టారు. ఈ ఒక్క ఉదాహరణే కాదు.. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఎన్నో మారుణ కాండలకు కారణమైన టెర్రరిస్టులను మనం ఏమి చేయలేం అంటే దానికి నేను ఒప్పుకోను అంటూ నాగార్జున చెప్పే డైలాగ్, టెర్రరిస్టులని పట్టుకుని వాళ్ళకి బిర్యానీ పెట్టి మేపడం కరెక్ట్ కాదు.. దొరికినచోటే వాళ్ళని చంపెయ్యాలనేది విజయ్ వర్మగా నాగ్ పాలిసీ అనేది వైల్డ్ డాగ్ ట్రైలర్ లోనే చూపించారు. మరి ఈ ప్రోమో లో నాగ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేవిలాగా సినిమా మీద అంచనాలు పెంచేవిలా ఉన్నాయి.