Advertisementt

లుక్ తో పాటు టైటిల్, డేట్ ఇచ్చేసాడు

Tue 30th Mar 2021 10:39 AM
nithiin,maestro movie,maestro movie first look,thamanna,nabha natesh  లుక్ తో పాటు టైటిల్, డేట్ ఇచ్చేసాడు
Maestro First Look లుక్ తో పాటు టైటిల్, డేట్ ఇచ్చేసాడు
Advertisement
Ads by CJ

ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నితిన్ మంచి హుషారుగా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ ముగిసి థియేటర్స్ తెరుచుకున్న మూడు నెలల్లో రెండు సినిమాలు విడుదల చేసాడు. ఫిబ్రవరిలో చెక్ సినిమాతో కాస్త డీలా పడిన నితిన్ కి ఈ వారంలో విడుదలైన రంగ్ దే కలర్ ఫుల్ హిట్ ఇచ్చింది. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నితిన్ రంగ్ దే హిట్ జోష్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య షాలినితో కలిసి కేక్ కట్ చేసిన నితిన్ పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖ డిజైనర్ నీరజ కోన ఆమె భర్త, సింగర్ సునీత, ఆమె భర్త రామ్ లతో పార్టీని ఎంజాయ్ చేసిన నితిన్ ఈ ఏడాది తన మూడో సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసేసాడు.

బాలీవుడ్ సూపర్ హిట్ అంధధూన్ రీమేక్ గా రాబోతున్న సినిమా లుక్ తో పాటు టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని నితిన్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేసింది టీం. అంధధూన్ తెలుగు రీమేక్ టైటిల్ గా మాస్ట్రో అనే టైటిల్‌ను ఖ‌రారు చేసింది. ఇక టైటిల్ తో పాటుగా నితిన్ మాస్ట్రో లుక్ అలాగే ఈ సినిమాని జూన్ 11న విడుద‌ల చెయ్యబోతున్నట్టుగా డేట్ ప్రకటించేసారు. ఈ సినిమాలో తమన్నా నెగెటివ్ రోల్ చేస్తుంటే, నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేసిన నితిన్ ఇప్పుడు మూడో సినిమా కి డేట్ ఇచ్చి ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేసాడు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నితిన్ కి సినీజోష్ టీం తరుపున బెస్ట్ విషెస్.

Maestro First Look:

Nithiin Maestro First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ