పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఫాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తోనే చాలా లెక్కలు సరి చేసేసారు పవన్. మూడేళ్ళ విరామాన్ని ఒకే ఒక్క వకీల్ సాబ్ తో తీర్చేలా కనిపిస్తున్నాడు. తీరని దాహంతో ఎదురు చూస్తున్న పవన్ ఫాన్స్ కి వకీల్ సాబ్ భారీ ఊరట ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది. అయితే పవన్ ఫాన్స్ కూడా వకీల్ సాబ్ ని ట్రేండింగ్ లో ఉంచుతూ పవన్ క్రేజ్ తగ్గలేదని చెప్పకనే చెబుతున్నారు. కానీ ఒక్క విషయంలో పవన్ ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 3 న భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీని కోసం గెస్ట్ ల రాక, పవన్ కళ్యాణ్ రావడం, మెగా హీరోల్లో చాలామంది హాజరవుతారనే అంచనాలతో ఫాన్స్ ఉత్సాహంగా ఉన్న టైం లో వకీల్ సాబ్ ఈవెంట్ కి పోలీస్ ల అనుమతి లభించని కారణంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయలేకపోతున్నారని తెలుస్తుంది. కరోనా ఆంక్షల మధ్యన భారీ ఈవెంట్స్ కి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వకీల్ సాబ్ ఈవెంట్ భారీ లెవల్లో జరక్కపోవచ్చనే న్యూస్ ఫాన్స్ ని గందరగోళానికి గురి చేస్తుంది.
మరి వకీల్ సాబ్ ఈవెంట్ కి పవన్ తో పాటుగా మెగా హీరోలు, అతిధులు హాజరైతే ఆ రచ్చ వేరు అంటూ ఫాన్స్ ఖుషి అవుతున్న టైములో ఈవెంట్ ఉండకపోవచ్చనే న్యూస్ చూసిన ఫాన్స్ బాగా డిస్పాయింట్ అవుతున్నారట.