రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం పూర్తి చెయ్యడం, మరోపక్క తండ్రి ఆచార్య చిత్రం కంప్లీట్ చెయ్యగానే కోలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ తో మరో పాన్ ఇండియా ఫిలిం మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా శంకర్ - రామ్ చరణ్ సినిమా అనౌన్సమెంట్ రాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు శంకర్. అయితే ఇప్పుడు రామ్ చరణ్ - శంకర్ కాంబో మూవీ మొదలు అయ్యేలా కనిపించడం లేదు. కారణం దర్శకుడు శంకర్ పై కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు కోర్టుకు వెళ్లడమే. ఎందుకంటే శంకర్ తో లైకా ప్రొడక్షన్స్ వారు ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టగా.. అది ఓ యాక్సిడెంట్ కారణంగా ఆగిపోయింది.
శంకర్ అసిస్టెంట్స్ ఇండియన్ 2 సెట్స్ లో జరిగిన క్రేన్ ప్రమాదంలో మరణించడంతో లైకా ప్రొడక్షన్స్ కి శంకర్ కి మధ్యన విభేదాలు తలెత్తడంతో ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇంతలో శంకర్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ మూవీ ఎనౌన్స్ చెయ్యడంతో.. లైకా వారు కోర్టుకి వెళ్లారు. ఇండియన్ 2 కి 230 కోట్ల బడ్జెట్ అనుకుని సినిమాని మొదలు పెట్టామని.. ఇప్పటికే జరిగిన షూటింగ్ కోసం ఆ బడ్జెట్ లో 180 కోట్లు ఖర్చు చేశామని.. ఇలాంటి సమయంలో ఇండియన్ 2 సినిమా ఆపెయ్యడం శంకర్ కి ధర్మం కాదని.. మిగతా ఖర్చు కూడా పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. శంకర్ ఇండియన్ 2 పూర్తి చేసి మరో ప్రాజెక్ట్ కి వెల్లాలంటూ వారు కోర్టుకెక్కడంతో.. ఇప్పుడు చరణ్ పాన్ ఇండియా మూవీ రిస్క్ లో పడినట్లే అయ్యింది.
శంకర్ ఇండియన్ 2 పూర్తి చెయ్యాలి. దానికి కమల్ హాసన్ రావాలి. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉండడంతో.. కమల్ అప్పుడే ఇండియన్ కి అందుబాటులోకి రాలేరు. సో రామ్ చరణ్ మూవీ మొదలవ్వడానికి చాలా టైం పట్టేసాలా కనబడుతుంది వ్యవహారం.