టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ చేసిన అక్కినేని సమంత.. పెళ్లి తర్వాత పద్దతి మార్చింది. పద్ధతి మార్చడం అంటే గ్లామర్ షో కి నో చెప్పి ట్రెడిషనల్ గా మారింది అనుకునేరూ. సమంత పద్దతి మార్చింది కమర్షియల్ మూవీస్ కి నో చెప్పి.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటుంది. అలాగే పాత్రకి, కథాబలమున్న మూవీస్ కి ఎస్ చెబుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నా.. గ్లామర్ పరంగా ఒక్క అడుగు వెనక్కి వెయ్యకపోగా.. మరింతగా గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత కి అటు ట్విట్టర్ ఇటు ఇన్స్టా ఫాలోవర్స్ మాములుగా లేరు.
గత వారం ఇన్స్టా లో 15 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే.. వారం తిరిగేసరికి ఆ లెక్క 16 మిలియన్స్ కి చేరింది. సౌత్ హీరోయిన్స్ లో ఇంత ఫాస్ట్ గా అభిమానుల ఫాలోయింగ్ లో ముందున్న చాలా తక్కువమంది హీరోయిన్స్ లిస్ట్ లోకి సమంత చేరడం మాములు విషయం కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ శాకుంతలం, అలాగే ఫ్యామిలీ మ్యాన్ పాన్ ఇండియా వెబ్ సీరియస్ తో సమంత ఇండియా వైడ్ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఆచి తూచి సినిమాలను ఒప్పుకుంటున్న సమంత కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉండడం చూస్తే ఆమె అభిమానులు ఆమెను మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రేంజ్ క్రేజ్ పెళ్లయ్యాక కూడా సమంత మెయింటింగ్ చేస్తుంది అంటే.. అది సమంత గొప్పదనమే.