రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ని శాసించే ఫిలింగా ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్దమవుతుంది. భారీ బడ్జెట్ తో భారీగా నిర్మితమవుతున్న ఆర్.ఆర్ ఆర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ ఇలా ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీ పై సౌత్ లోనే కాదు.. నార్త్ లోను భారీ క్రేజ్ ఉంది. అవ్వడానికి ఎన్టీఆర్ మరియు చరణ్ లు టాలీవుడ్ హీరోలే అయినప్పటికీ.. రాజమౌళి బాహుబలి ఇమేజ్ ఆర్.ఆర్.ఆర్ ని అందనంత ఎత్తులో నిలబెట్టింది. అందుకే అన్ని భాషల్లో ఆర్.ఆర్.ఆర్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది.
అందులో ముందుగా నార్త్ ఆర్.ఆర్.ఆర్ హక్కుల ని కనీవినీ ఎరగని మొత్తంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ సొంతం చేసుకున్నట్టుగా ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు ప్రకటించారు. ఉత్తరాది డిస్ట్రిబ్యూషన్ హక్కులతో పాటు అన్ని భాషల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్ , శాటిలైట్ హక్కులను పెన్ మూవీస్ సొంతం చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఉత్తరాది హక్కులు, అన్ని భాషల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్ , శాటిలైట్ హక్కులను కలిపి 140 కోట్లకి పెన్ మూవీస్ RRR మేకర్స్ తో డీల్ కుదుర్చుకున్నట్టుగా ఫిలింనగర్ టాక్. అంతేకాదు పెన్ మూవీస్ సంస్థ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాన్ని తాము ప్రెజెంట్ చేస్తుండడం చాలా గౌరవంగా, గర్వంగా ఉందని ట్వీట్ చేసింది.