Advertisementt

వైల్డ్ డాగ్ కోసం చిరు స్పెషల్ డిష్

Thu 01st Apr 2021 10:47 PM
chiranjeevi,makes special dish,nagarjuna,wild dog,megastar chiru  వైల్డ్ డాగ్ కోసం చిరు స్పెషల్ డిష్
Chiranjeevi Makes Special Dish for Nagarjuna వైల్డ్ డాగ్ కోసం చిరు స్పెషల్ డిష్
Advertisement
Ads by CJ

నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. మంచి ప్రమోషన్స్ తో నాగ్ వైల్డ్ డాగ్ తో థియేటర్స్ లోకి దిగుతున్నాడు. అయితే ఇప్పుడు వైల్డ్ డాగ్ నాగ్ కోసం ఆయన ఫ్రెండ్ మెగాస్టార్ చిరు చేసిన స్పెషల్ డిష్ అండ్ డిన్నర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున - మెగాస్టార్ చిరు ఎంత మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలుసు. కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్ అనుమతుల కోసం చిరు- నాగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలవడం, ఇండస్ట్రీ కి సంబందించిన అనేక విషయాలు కోసం అప్పుడప్పుడు తలసాని శ్రీనివకాస్ యాదవ్ తో మీట్ అవడం వంటివి చెయ్యడం చూస్తూనే ఉన్నాం.

అంత మంచి ఫ్రెండ్స్ అయిన చిరు - నాగ్ లు చిరంజీవి ఇంట్లో డిన్నర్ ని కలిసి చేసారు. అది కూడా నాగ్ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో భాగమంటూ నాగ్ తన సోషల్ మీడియాలో లో పిక్ తో పటు పోస్ట్ చేసారు. మెగాస్టార్ చిరు.. నాగార్జున కోసం హాట్ డెలిషియస్ డిన్నర్ చేసిపెట్టిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరు స్పెషల్ గా నాగ్ కోసం చేసిన స్పెషల్ డిష్ తో చిరు - నాగ్ ఉన్న పిక్ ని చిరు భార్య సురేఖ తీసిన విషయం అభిమానులతో షేర్ చేసుకున్నారు చిరు అండ్ నాగ్ లు. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సూపర్ హిట్ అవ్వాలంటూ చిరు నాగ్ కి డిన్నర్ పార్టీ ఇచ్చారు.

Chiranjeevi Makes Special Dish for Nagarjuna:

Chiru Makes Special Dish for Nag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ