గత ఏడాది కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడిన ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం ఇప్పుడు నిర్విరామంగా షూటింగ్ చేసుకుంటుంది. కరోనా ఆంక్షలకు లోబడి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చిత్రీకరణతో రాజమౌళి బిజీగా వున్నారు. అక్టోబర్ 13 రిలీజ్ టార్గెట్ తో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ కి అలియా కష్టాలు వెంటాడుతున్నాయి. చరణ్ రామరాజుకి జోడిగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ వలన అడుగడుగునా ఆర్.ఆర్.ఆర్ కి ఇబ్బందులే అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే మొన్నామధ్యన ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవడంతో కొన్నిరోజుల పాటు అలియా కూడా హోమ్ క్వారంటైన్ కి వెళ్ళింది. ప్రస్తుతం క్లయిమాక్స్ షూటింగ్ చిత్రీకరణలో ఉన్న ఆర్.ఆర్.ఆర్ యూనిట్ కి అలియా కొన్నిరోజులుగా అందుబాటులో లేదు.
మరోపక్క ఆమె నటిస్తున్న గంగూబాయ్ సినిమా షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదా పడనుంది. మొన్నటికి మొన్న గంగూబాయ్ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీకి కరోనా సోకింది. అయితే ఇప్పుడు తాజాగా అలియా భట్ కరోనా బారిన పడడంతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని ఎక్కడివక్కడ నిలిచిపోయాయని సమాచారం. తనకి కరోనా సోకినట్లుగా అలియా భట్ తన ఇన్‌స్టాలో గురువారం అర్థరాత్రి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపింది. అయితే వైద్యుల సలహా మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. ఇక అలియా భట్ కి కరోనా సోకింది అనగానే ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ తెగ టెంక్షన్ పడిపోతున్నారు. సినిమా మళ్ళి వాయిదా పడుతుందా? ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటూ ఫాన్స్ బెంబేలెత్తిపోతున్నారు.