Advertisementt

మొన్న కీర్తి - నేడు రష్మిక

Sat 03rd Apr 2021 12:06 PM
rashmika mandanna,keerthy suresh,sulthan movie,rashmika looks,keerthy looks,trolls on rashmika looks  మొన్న కీర్తి - నేడు రష్మిక
Trolling on Rashmika Mandanna Looks మొన్న కీర్తి - నేడు రష్మిక
Advertisement
Ads by CJ

తెలుగులో ఛలో సినిమాతో చలాకి పిల్లలా కనిపించిన రష్మిక మందన్న.. గీత గోవిందంలో మేడం గా సారీస్ తోనూ, ట్రెడిషనల్ గా కనిపించి ఆకట్టుకుంది. తర్వాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ,. భీష్మ సినిమాల్లోనూ రష్మిక మరీ గ్లామర్ డాల్ లా కనిపించకపోయినా.. అభినయంతో పర్లేదు అనిపించుకుంది. అయితే గ్లామర్ లేని రష్మిక ని పుష్ప పాన్ ఇండియా మూవీ లో ఎలా తీసుకున్నారో అనే అనుమానం అప్పట్లో అల్లు అర్జున్ ఫాన్స్ లో ఉన్నా.. డీ గ్లామర్ రోల్ కదా అని సరిపెట్టుకున్నారు. అయితే తాజాగా రష్మిక నటించిన ఫస్ట్ తమిళ్ మూవీ సుల్తాన్ నిన్న విడుదలైంది. కార్తీ హీరోగా, రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. 

అయితే ఈ సినిమాలో రష్మిక లుక్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రేక్షకులకు రష్మిక అలాంటి లుక్స్ లో నచ్చుతుందేమో కానీ.. తెలుగు ప్రేక్షకులకు ఎక్కదు. అసలు ఈ సినిమాలో రుక్మిణి గా రష్మిక తేలిపోయింది అని, లంగా ఓణీ లో పల్లెటూరి స్టయిల్ మెయింటింగ్ చేసినా.. రష్మిక లుక్స్ పరంగా తేలిపోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫాన్స్ బెంబేలెత్తుతున్నారు. పుష్ప సినిమాకి భీబత్సమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు రష్మిక ని సుల్తాన్ లో ఇలా చూసాక పుష్ప లో ఆమెని ఊహించుకుంటేనే వారు భయపడిపోతున్నారు. 

మొన్నీమధ్యన కీర్తి సురేష్ లుక్స్ విషయంలోనూ మహేష్ ఫాన్స్ వర్రీ అయిన విషయం తెలిసిందే. మహానటిగా అద్భుతంగా అదరగొట్టిన కీర్తి సురేష్ మిస్ ఇండియా మూవీకోసం వెయిట్ లాస్ అయ్యి ఫేస్ లో కళ కోల్పోయి లుక్స్ విషయంలో తీవ్రమైన ట్రోలింగ్ కి గురయ్యింది. దానితో సర్కారు వారి పాటలో కీర్తి లుక్స్ విషయంలో మహేష్ ఫాన్స్ ఎంతగా కంగారు పడ్డారో.. ఇప్పుడు రష్మిక లుక్స్ విషయంలో బన్నీ ఫాన్స్ అంతే కంగారు పడుతున్నారు.

Trolling on Rashmika Mandanna Looks:

Trolling on Rashmika Mandanna Looks in Sulthan Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ