పవన్ కళ్యాణ్ ఫాన్స్ వకీల్ సాబ్ మ్యానితో ఊగిపోతున్నారు. పవన్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఎప్పడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క ముగ్గురు హీరోయిన్స్ వకీల్ సాబ్ ని తెగ ప్రమోట్ చేస్తున్నారు. అంజలి, నివేత థామస్ వకీల్ సాబ్ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. అసలు ఈ రోజు ఈపాటికి వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫాన్స్ హంగామా మాములుగా ఉండేది కాదు. ఏప్రిల్ 3 న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు.
దానితో పవన్ ఫాన్స్ ఊగిపోయారు. దిల్ రాజు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ గా ప్లాన్ చేసి గెస్ట్ లను కూడా పిలిచే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది. కరోనా కారణంగా పోలీస్ లు వకీల్ సాబ్ ఈవెంట్ కి అనుమతి ఇవ్వకపోవడంతో వకీల్ సాబ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. లేదంటే ఈ టైం కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ హైదరాబాద్ లో చేసే హంగామాకి ఎన్ని రోడ్లు బ్లాక్ అయ్యేవో. ఈవెంట్ జరిగే చోట ట్రాఫిక్ జాం తో సాధారణ జనాలు అల్లాడిపోయేవారే. పాపం ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా అన్నట్టుగా వకీల్ సాబ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో పవన్ ఫాన్స్ ఉస్సురుమంటున్నారు.