Advertisementt

ఇక్కడ నివేత థామస్ - అక్కడ అక్షయ్ కుమార్

Sat 10th Apr 2021 03:17 PM
nivetha thomas,akshay kumar,corona,covid 19,corona second wave  ఇక్కడ నివేత థామస్ - అక్కడ అక్షయ్ కుమార్
Akshay Kumar Tests Corona Positive ఇక్కడ నివేత థామస్ - అక్కడ అక్షయ్ కుమార్
Advertisement
Ads by CJ

కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్, మిగతా ఆఫీసులు ఓపెన్ అయ్యి అన్ని కార్యకలాపాలు మొదలైనా.. పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలయ్యాక సినిమా సెలబ్రిటీస్ దగ్గరనుండి పొలిటికల్ లీడర్స్ వరకు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం. నిన్నటికి నిన్న టాలీవుడ్ వకీల్ సాబ్ హీరోయిన్ నివేద థమన్ కరోనా బారిన పడడంతో వకీల్ సాబ్ టీం టెంక్షన్ పడింది. ఎందుకంటే నివేద థామస్ వకీల్ సాబ్ ఇంటర్వ్యూ లో టీం తో కలిసి పాల్గొంది.

ఇక నేడు బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ట్వీట్ చెయ్యడం ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగా.. ఆయన హోమ్ క్వారంటైన్ కి వెళ్ళినట్టుగా ట్వీట్ చేసారు. ప్రస్తుతం నార్త్ లో కరోనా సెకండ్ వెవ్ కల్లోలం మాములుగా లేదు. అక్కడ చాలామంది టాప్ హీరో హీరోయిన్స్ కరోనా బారిన పడడం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల బన్సాలి, అలియా భట్, రణబీర్ కపూర్ ఇంకా చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే ఏకంగా హాస్పిటల్ పాలవడం అందరిలో అందోళన కలిగిస్తున్న అంశాలే.

Akshay Kumar Tests Corona Positive:

Akshay Kumar Tests Covid Positive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ