Advertisementt

ప్రేమించి బాధపడ్డా.. పెళ్ళికి సమయం ఉంది

Sun 04th Apr 2021 05:43 PM
anjali,jai,anjali love,vakeel saab heroine anjali,anjali stills,anjali photos,anjali images  ప్రేమించి బాధపడ్డా.. పెళ్ళికి సమయం ఉంది
Loved and saddened, There is time for marriage ప్రేమించి బాధపడ్డా.. పెళ్ళికి సమయం ఉంది
Advertisement
Ads by CJ

హీరోయిన్ అంజలి అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లోనూ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. కెరీర్ చక్కబడుతున్న టైములో తమిళ హీరో జై తో ప్రేమలో మునిగి తేలుతూ కెరీర్ ని నెగ్లెట్ చేసింది. అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న అంజలి తాను ప్రేమలో విఫలమైన సంగతి బయట పెట్టింది. గతంలో తాను ప్రేమలో పడిన సంగతి వాస్తవమే అని చెప్పింది. ఒక వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. కానీ కొన్ని కారణాల వలన నా ప్రేమ బ్రేకప్ అయ్యింది. లేదంటే ఈపాటికి నేను ప్రేమించిన వ్యక్తిని మీకు పరిచయం చేసేదానిని అంటూ చెప్పుకొచ్చింది. 

తాను ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు తన తల్లి, తన వృత్తే తనని కోలుకునేలా చేశాయని అంటుంది. అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే నేను కోలుకోగలిగాను. ఇక ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ మీదే ఉంది.. పెళ్లి కి మరికాస్త సమయం ఉంది అంటూ చెప్పుకొచ్చింది అంజలి. అంజలి వకీల్ సాబ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. వకీల్ సాబ్ హిట్ అయితే తాను మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలనేది ఆమె కోరిక 

Loved and saddened, There is time for marriage:

Finally, Anjali Reacts On Her Breakup

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ