రాధేశ్యామ్ మొదలైనప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ కంప్లైంట్ ఏమిటి అంటే రాధేశ్యామ్ సినిమా పబ్లిసిటీ విషయంలో ప్రభాస్ అండ్ టీం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు.. ఎక్కడా సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నాలు చెయ్యడం లేదు. ఇలా అయితే సాహో లాగే రాధేశ్యామ్ విషయంలోనూ దెబ్బ పడడం ఖాయం అంటూ ప్రభాస్ ఫాన్స్ వర్రీ అవుతున్నారు. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రివీల్ చెయ్యడానికే చాలా సమయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో యువీ క్రియేషన్స్ వారిని ఫుల్ గా ట్రోల్ చేస్తే గాని రాధేశ్యామ్ లుక్ బయటికి రాలేదు. ఇక రాధేశ్యామ్ గ్లిమ్బ్స్ లో ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
పాన్ ఇండియా మూవీ అయ్యుండి ఇలా స్లో గా ప్రమోషన్స్ ఉంటే.. సినిమాకి హైప్ క్రియేట్ అవ్వదు అంటూ ఫాన్స్ వర్రీ అవుతుంటే రాధేశ్యామ్ టీం మాత్రం కూల్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతోంది. ఈ రెండు నెలల్లో రాధేశ్యామ్ టీం రాధేశ్యామ్ ని పాన్ ఇండియా లెవల్లో పబ్లిసిటీ చేస్తూ సినిమాని ట్రేండింగ్ లో ఉంచే ప్లాన్స్ లో ఉందట. రాధేశ్యామ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ సినిమా మీద అంచనాలు పెంచే పనిలో టీం ఉందట. ఇక రాధేశ్యామ్ టీం ఓవర్సీస్ లో కూడా సినిమాని ప్రమోట్ చేసే ఆలోచనలో ఉందట. ఇప్పటికే షూటింగ్, కీలక పాత్రల డబ్బింగ్ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుంటుందట. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలు రాధేశ్యామ్ పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇవ్వబోతుంది. నార్త్ లో రాధేశ్యామ్ ని డిఫ్రెంట్ గా ప్రమోట్ చేయబోతున్నారట.