లోకనాయకుడు కమల్ హాసన్ అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ హాసన్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున కమల్ హాసన్ సినిమాల విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి. కమల్ హాసన్ రాజకీయాల కోసం సినిమాలు వదిలిపెట్టడానికి సిద్ధం అంటూ ప్రకటించారు. రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న కమల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కమల్ ఇలాంటి ప్రకటన చేయడం అభిమానులలో అందోళన రేకెత్తిస్తుంది.
నా పొలిటికల్ ఎంట్రీ చరిత్రాత్మకమైంది. గతంలో ఎంజీఆర్ పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాల్లో నటించారు. రాజకీయాలంటేనే డబ్బుతో పని. అందుకే సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లోకి వచ్చారాయను. నా రాజకీయ జీవితానికి సినిమాలే అడ్డంకి అంటే సినిమా వదిలెయ్యడానికి నేను సిద్ధం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాను. లేదంటే నిర్మాతలు నష్టపోతారు. ఇక ఎలక్షన్స్ పూర్తయ్యాక మళ్ళీ పాలిటిక్స్ కి గుడ్ బాయ్ చెప్పి సినిమాలు చేసుకుంటారు కమల్ అంటూ చాలామంది అంటున్నారు.. ఎవరు తప్పుకుంటారో.. ఎవరు ఉంటారో.. ఎన్నికలయ్యాక మాట్లాడుకుందాం అన్నారు ఆయన.