సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తరవాత సాయి ధరమ్ తేజ్ దేవా కట్టాతో జత కట్టాడు. దేవాకట్టా డైరెక్షన్ లో రిపబ్లిక్ సినిమా ఫస్ట్ లుక్ తోనే సాయి ధరమ్ ఆకట్టుకున్నాడు. రమ్యకృష్ణ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఓ సివిల్ సర్వీస్ అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన రిపబ్లిక్ టీజర్ లో వ్యవస్థకి - అధికారానికి మధ్యన జరిగే యుద్ధమే ఈ రిపబ్లిక్ అని చెప్పకనే చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు.. అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం.. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులు అని తెలియకుండా ఇంకా ఫ్యురల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం.. అంటూ సాయి ధరమ్ తేజ్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది.
పొలిటికల్ పార్టీల ప్రచారంలో ప్రజలు, పొలిటికల్ లీడర్స్ మధ్యన జరిగే గొడవలను హైలెట్ చేసారు. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్ అండ్ కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు. వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టె సర్ అంటూ సాయి ధరమ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్యకృష్ణ లుక్స్ బావున్నాయి. గవర్నమెంట్ ఆఫీసర్ కి పొలిటికల్ లీడర్స్ కి మధ్యన జరిగే యుద్ధం ఈ రిపబ్లిక్ అనేది టీజర్ లో స్పష్టం చేసారు. ఆఫీసర్ గా సాయి ధరమ్ లుక్స్, అతని ఎక్సప్రెషన్స్ బావున్నాయి.