Advertisementt

అల్లు వారి వివరణ దేనికో

Mon 05th Apr 2021 10:06 PM
allu aravind,covid19,positive reports,clarifies,corona vaccine,aravind about corona  అల్లు వారి వివరణ దేనికో
Allu Aravind Clarifies On Covid19 And Vaccine అల్లు వారి వివరణ దేనికో
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకు మాల్దీవులకు వెళ్ళాడు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ అల్లు అరవింద్ కి కరోనా పోజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే అందరికి కరోనా వస్తుంది అల్లు అరవింద్ కి వచ్చింది. అందులో వింతేమీ లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అల్లు అరవింద్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కరోనా బారిన పడడమే హాట్ టాపిక్ అయ్యింది. గత రెండు రోజులుగా అల్లు అరవింద్ కరోనా వ్యాక్సిన్ 2 డోస్ లు తీసుకున్నాకే కరోనా సోకింది అంటూ ప్రచారం జరుగుతుంది. అసలే కరోనా వ్యాక్సిన్ మీద చాలామందిలో అప నమ్మకాలు ఉన్నాయి. కరోనా టీకా రెండు డోస్ లు తీసుకున్నాక కూడా కరోనా వస్తుంది అని చాలామంది చెబుతున్నారు. అలాగే వ్యాక్సిన్ పని చెయ్యడం లేదు, వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయ్ అంటూ అపోహలు ఉన్నాయి. 

అలాంటి టైం లో రెండు డోస్ లు తీసుకున్న అరవింద్ కి కరోనా సోకడం అందునా సెలెబ్రిటీ కావడంతో బాగా హైలెట్ అయ్యారాయన. తనకి కరోనా సోకడం నిజమే అని, అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్నాక కరోనా రావడం అనేది కరెక్ట్ కాదని, తాను ఇద్దరి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లగా తమ ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది అని, తాను ఇంకో ఫ్రెండ్ ఫస్ట్ డోస్ తీసుకున్నామని, ఇంకా రెండో డోస్ తీసుకోలేదని, తామిద్దరికి జస్ట్ టు డేస్ ఫీవర్ ఉందని, కానీ కరోనా వ్యాక్సిన్ ఒక్క డోస్ కూడా తీసుకొని మరో ఫ్రెండ్ మాత్రం హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని, తాము వ్యాక్సిన్ తీసుకోవడం వలన తమ శరీరాన్ని కరోనా ఏమంత డ్యామేజ్ చేయలేదంటూ ఓ వీడియో బైట్ వదిలాడు. అంటే వ్యాక్సిన్ రెండు డోస్ లు పడ్డాక కరోనా వచ్చింది అనేదానికి అరవింద్ గారు ఇలా వివరణ ఇచ్చారన్నమాట.

Allu Aravind Clarifies On Covid19 And Vaccine:

Allu Aravind Clarifies About Covid Positive Reports

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ